AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk: కల్తీ పాలను గుర్తించడం చాలా ఈజీ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

అమృతం లాంటి పాలు నేడు కాలకూట విషంగా మారుతున్నాయి. తెల్లగా కనిపిస్తున్న ప్రతి చుక్కా స్వచ్ఛమైనది అనుకుంటే పొరపాటే.. కొందరు కేటుగాళ్లు పాలను చిక్కగా మార్చడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడాల్సిన పాలు, వారి ప్రాణాలనే హరించే సైలెంట్ కిల్లర్స్‌గా మారుతున్నాయి.

Milk: కల్తీ పాలను గుర్తించడం చాలా ఈజీ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
Simple Home Tests To Identify Adulterated Milk
Krishna S
|

Updated on: Mar 03, 2026 | 2:11 PM

Share

ప్రస్తుతం కాలంలో పాలు కాస్త విషయంగా మారుతున్నాయి. మనం మన బిడ్డలకు గ్లాసుడు అమృతం ఇస్తున్నామని సంబరపడుతుంటే.. స్వార్థపరులు అందులో యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ వంటి భయంకర రసాయనాలు కలిపి స్లో పాయిజన్‌ను అందిస్తున్నారు. పాలు తెల్లగా ఉన్నాయి కదా అని తాగేస్తే.. అవి మీ కిడ్నీలను, ప్రేగులను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. అసలు ఈ తెల్లని మాఫియా పాలను ఎలా కల్తీ చేస్తోంది? పాలలో దాగి ఉన్న ఆ నల్లని నిజాలేంటి? మీ ఇంట్లోనే కల్తీని ఎలా పట్టేయాలి? అనేది తెలుసుకుందాం..

కల్తీ వెనుక ఉన్న భయంకర రసాయనాలు:

కేవలం నీళ్లు కలపడం పాత పద్ధతి. ఇప్పుడు లాభాల కోసం ముఠాలు వాడుతున్న పదార్థాలు ఇవే..

యూరియా – డిటర్జెంట్: పాలకు తెల్లదనం, నురగ రావడానికి వీటిని వాడుతున్నారు. ఇవి తాగితే కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా, పేగుల్లో అల్సర్లు ఏర్పడతాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్: పాలు విరగకుండా ఉండటానికి దీన్ని కలుపుతారు. ఇది జీర్ణకోశ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది.

స్టార్చ్ – గంజి పొడి: పాలు చిక్కగా కనిపించడానికి వాడే ఈ పొడులు పెద్ద పేగుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

సింథటిక్ మిల్క్: అసలు ఆవు, గేదె ప్రమేయం లేకుండా యూరియా, కాస్టిక్ సోడా, శుద్ధి చేసిన నూనె కలిపి సింథటిక్ పాలు తయారు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం.

చిన్న పరీక్ష.. మీ ప్రాణాలకు రక్షణ..

బయట దొరికే పాలు కల్తీయో కాదో మీ ఇంట్లోనే ఈ చిన్న పరీక్షలతో తెలుసుకోవచ్చు:

నీటి కల్తీ: ఒక చుక్క పాలను నునుపైన ఫ్లోర్ మీద మీద వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ వెనుక తెల్లటి గీతను వదులుతాయి. నీళ్లు కలిపితే చుక్క వేగంగా కిందకు జారిపోతుంది. ఎటువంటి గీత ఉండదు.

డిటర్జెంట్ టెస్ట్: పాలను ఒక గాజు సీసాలో పోసి గట్టిగా కుదిపితే.. దట్టమైన నురుగు వచ్చి అది ఎక్కువ సేపు అలాగే ఉంటే అందులో సర్ఫ్ లేదా సోప్ ఆయిల్ కలిపారని అర్థం.

పిండి పదార్థాల గుర్తింపు: కొద్దిగా పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. పాలు నీలం రంగులోకి మారితే అందులో గంజి లేదా స్టార్చ్ పౌడర్ కలిపినట్లు స్పష్టమవుతుంది.

యూరియా పరీక్ష: పాలలో కొంచెం పసుపు వేసి, అందులో ఎర్ర లిట్మస్ పేపర్ ఉంచితే.. అది నీలం రంగులోకి మారితే యూరియా ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు.

Follow Us
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి