Megastar Chiranjeevi : నా కిడ్నీ మార్పిడికి చిరంజీవి 70 లక్షలు ఖర్చు చేశాడు.. టాలీవుడ్ విలన్..
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అలాగే ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు సాయం అందించారు. చిరంజీవి స్పూర్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయినవారు చాలా మంది ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సినీ పరిశ్రమలో విలన్ గా పేరుగాంచిన నటుడు పొన్నంబళం. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలతో పాపులర్ అయ్యాడు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. తన ఆరోగ్యం విషయంలో చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు. కిడ్నీలు పూర్తిగా పాడై, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవనంపై ఆశలు కోల్పోయి, మరణించాలని కోరుకున్న సమయంలో చిరంజీవిని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. ఆ కష్టకాలంలో పొన్నంబళం చిరంజీవికి ఫోన్ చేశానని.. అప్పుడు చిరంజీవి అప్పుడు నేపాల్‌లో షూటింగ్‌లో ఉన్నారని అన్నారు. పొన్నంబళం తన పరిస్థితిని వివరించగానే, చిరంజీవి నిమిషాల వ్యవధిలోనే స్పందించారని చెప్పుకొచ్చింది. “ఏం బాధపడొద్దు, నేనున్నాను” అని భరోసా ఇచ్చి, వెంటనే అపోలో ఆసుపత్రి నుంచి ఫోన్ వస్తుందని తెలిపారు. అన్నట్లుగానే, పది నిమిషాల్లోపు అపోలో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. పొన్నంబళం వెంటనే ఆసుపత్రికి వెళ్లగా, అప్పటికే డాక్టర్ సుబ్బారావు ఆయన కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
పొన్నంబళం మొదట డయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్తున్నానని భావించానని.. అయితే, డాక్టర్ సుబ్బారావు డోనర్ గురించి అడగగా, చిరంజీవి కిడ్నీ మార్పిడికి ఏర్పాట్లు చేశారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు. తన మేనల్లుడు కిడ్నీ దాతగా మారడంతో, వారిద్దరికీ ఒకేసారి చికిత్సను ప్రారంభించారు. చికిత్సకు ముందు రోజు రూ. 80,000 ఖర్చుతో పూర్తి స్థాయి శరీర పరీక్షలు జరిగాయి. చిరంజీవి ఆ ఖర్చులు గురించి ఏమీ ఆలోచించకుండా, “నువ్వు నా తమ్ముడివి, చికిత్స చేసుకో” అని ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 10న ఇద్దరికీ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ మొత్తం ప్రక్రియకు రూ. 70 లక్షలు ఖర్చయినట్లు పొన్నంబళం వెల్లడించారు. చిరంజీవి అందించిన ఈ సహాయం తన జీవితంలో మర్చిపోలేనిదని, ఇప్పుడు తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
తన కష్టకాలంలో తనకు అర్జున్, కే.ఎస్. కుమార్, శరత్‌కుమార్ వంటి ఇతర కళాకారులు కూడా సహాయం చేశారని పొన్నంబళం గుర్తు చేసుకున్నారు. శరత్‌కుమార్‌కు కూడా ఒకప్పుడు చిరంజీవి సహాయం చేశారని, దానిని శరత్‌కుమార్ గుర్తుంచుకుని తనకు సహాయం చేశారని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ సమస్యల కారణంగా తాను 126 కిలోల నుంచి 82 కిలోలకు తగ్గిపోయి, దాదాపు 44 కిలోల బరువు కోల్పోయానని చెప్పారు. ఆ సమయంలో తీవ్ర నిరాశతో పోరూర్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి, తన ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నానని, కానీ చిరంజీవి పేరు గుర్తురావడంతో ఆయనకు ఫోన్ చేశానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

Chiranjeevi, Ponnabalam
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
