పల్నాడు జిల్లా గారపాడులో రాత్రికి రాత్రే 30 క్వింటాళ్ల తేజా రకం మిరపకాయలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. వర్షం కారణంగా రైతులు ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారు ఏడు లక్షల రూపాయల విలువైన మిర్చిని కోల్పోయిన రైతులు వెంకట్రావు, సుధాకర్ పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.