Seetha Temple: నేటికీ అశోక వనం జాడలు.. సీతాదేవి ఆలయం ఎక్కడ ఉందంటే
హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు. మానవుడిగా పుట్టి దేవుడిగా పూజలను అందుకుంటున్న రామాలయాలు మన దేశంలో గల్లీ గల్లీలో ఉన్నాయి. రామలయాల్లో సీతారాములు లక్ష్మణుడుతో పాటు హనుమంతుడు పూజలను అందుకుంటారు. ఇక రామ భక్త హనుమాన్ ఆలయాలకు కొదవే లేదు. అయితే రామయ్య తో పాటు ముగ్గురు తమ్ముళ్ళుకు కూడా కేరళలో ఆలయాలున్నాయి. అయితే రామయ్య భార్య సీతాదేవి కూడా ఆలయం ఉంది. అయితే మన దేశంలో కాదు పొరుగు దేశమైన శ్రీలంకలో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ది చెందిన సీతాదేవి ఆలయం.