తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సామాజికంగా గౌరవ మర్యాదలకు, పేరు ప్రతిష్ఠలకు లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా వృథా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ఒప్పందాలు కుదర్చుకోవడానికి ఇది సమయం కాదు. ఆధ్యాత్మిక విషయాల మీద, తీర్థయాత్రల మీద శ్రద్ధ పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు యథాతథంగా సాగిపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. చేపట్టిన వ్యవహారాలు, పనులు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.