బుధ గ్రహానికి తన ఉచ్ఛ స్థానమైన కన్యా రాశి తర్వాత తులా రాశి బాగా అనుకూలమైన స్థానం. ఈ రాశిలో ఈ నెల 11 నుంచి 29 వరకూ సంచారం చేస్తున్న బుధ గ్రహం వల్ల కొన్ని రాశుల వారు కెరీర్ పరంగా ఊహించని అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. బుద్ధి కారకుడైన బుధుడు తులా రాశి వంటి సమతూక రాశిలోకి ప్రవేశించినప్పుడు సాధారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమయస్ఫూర్తిగా, సమతూకంగా వ్యవహరిస్తూ అనేక సమస్యల నుంచి బయటపడడమే కాకుండా పురోగతికి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తులా రాశి బుధుడి వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారు శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది.