AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు..ఈ వైరల్ వీడియో మీరు తప్పక చూడాల్సిందే

నేటి కాలంలో చదువు లేదా ఉద్యోగ రీత్యా పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరాల్లో లేదా విదేశాల్లో నివసించడం సర్వసాధారణం. అయితే, వారి మధ్య ఉన్న దూరాన్ని సాంకేతికత ఎలా తగ్గిస్తుందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది. అమ్మనాన్నల ప్రేమకు సరిహద్దులు లేవు! తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ నిష్కల్మషంగా ఉంటుంది. పిల్లలు ఎంత ఎదిగినా, ఎంత దూరంలో ఉన్నా వారి ఆలోచనలు ఎప్పుడూ పిల్లల చుట్టూనే తిరుగుతుంటాయి. దీనికి అద్దం పట్టే ఒక భావోద్వేగ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరినీ కదిలిస్తోంది.

సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు..ఈ వైరల్ వీడియో మీరు తప్పక చూడాల్సిందే
Parents Waves At Cctv Camera
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 1:08 PM

Share

నేటి కాలంలో చదువు లేదా ఉద్యోగ రీత్యా పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరాల్లో లేదా విదేశాల్లో నివసించడం సర్వసాధారణం. అయితే, వారి మధ్య ఉన్న దూరాన్ని సాంకేతికత ఎలా తగ్గిస్తుందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది. అమ్మనాన్నల ప్రేమకు సరిహద్దులు లేవు! తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ నిష్కల్మషంగా ఉంటుంది. పిల్లలు ఎంత ఎదిగినా, ఎంత దూరంలో ఉన్నా వారి ఆలోచనలు ఎప్పుడూ పిల్లల చుట్టూనే తిరుగుతుంటాయి. దీనికి అద్దం పట్టే ఒక భావోద్వేగ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరినీ కదిలిస్తోంది. ఒక యువతి తన తల్లిదండ్రుల భద్రత కోసం వారి ఇంట్లో సిసిటివి (CCTV) కెమెరాను ఏర్పాటు చేసింది.

ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఒకరికొకరు పలకరించుకుంటూ ఉండే ఈ రోజుల్లో ఒక కుటుంబం తమ ప్రేమను పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది. దూరంగా ఉంటున్న కుమార్తెపై తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమానురాగాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివానీ శుక్లా అనే యువతి, తన తల్లిదండ్రులు ప్రతిరోజూ సీసీటీవీ కెమెరా ముందు తనను కలుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

శివానీ శుక్లా అనే యువతి తన తల్లిదండ్రులు ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి, భద్రత కోసం ఇంట్లో ఒక సిసిటివి కెమెరాను అమర్చింది. సాధారణంగా సిసిటివి అంటే దొంగతనాలు లేదా నిఘా కోసం వాడతాము. కానీ, ఇక్కడ అది ఒక ప్రేమ సంభాషణకు వేదికైంది. ఆ తల్లిదండ్రులకు తమ కుమార్తె తన మొబైల్ ద్వారా ఈ కెమెరా దృశ్యాలను చూస్తుందని తెలుసు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, వృద్ధ దంపతులు పనులు చేసుకుంటూ మధ్యమధ్యలో కెమెరా దగ్గరకు వస్తారు. కెమెరా వైపు చూస్తూ చేతులు ఊపుతూ తల్లీ! బాగున్నావా?, టైమ్‌కు తింటున్నావా? అంటూ ప్రేమగా అడుగుతారు. ఆ సమయంలో వారి ముఖాల్లో కనిపించే ఆనందం, కుమార్తెను నేరుగా చూస్తున్నామనే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఒక చక్కటి సూచన లాంటిది.. వారిని తరచుగా పలకరించండి అని ఒక నెటిజన్లు చాలా మంది కామెంట్ చేశారు. సాంకేతికత మనల్ని ఇంత దగ్గర చేస్తుందని ఊహించలేదు, ఇది చాలా అందమైన దృశ్యం అని మరొకరు రాశారు.

వీడియో ఇక్కడ చూడండి..

నేటి బిజీ లైఫ్‌లో మనం ఎంత బిజీగా ఉన్నా, మన కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కోసం కొద్ది నిమిషాలు కేటాయించడం ఎంత అవసరమో ఈ వీడియో గుర్తు చేస్తోంది. దూరం అనేది కేవలం కిలోమీటర్లలోనే ఉంటుందని, మనసుల మధ్య కాదని వైరల్‌గా మారిన ఈ వీడియో తెలియజేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర