Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబ్ వీడియోలు చూసి గన్ కాల్చడం నేర్చుకున్న నిందితులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబా సిద్ధిఖీ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. యూట్యూబ్ చూసి తాము తుపాకీ కాల్చడం నేర్చుకున్నట్లు పోలీసుల ఎదుట తెలిపారు..

Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబ్ వీడియోలు చూసి గన్ కాల్చడం నేర్చుకున్న నిందితులు
Baba Siddique Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 16, 2024 | 6:31 PM

ముంబై, అక్టోబర్‌ 16: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ గత శ‌నివారం రాత్రి దారుణ హ‌త్యకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సిద్ధిఖీ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. సిద్ధిఖీని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తామే కాల్చి చంపినట్లు ప్రకటించారు. తమకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్‌ దావుద్‌ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్‌ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరిచేస్తామంటూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడు శుభం రామేశ్వర్‌ లంకర్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో హెచ్చరించాడు.

ఇక ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను ముంబై పోలీసులు గుర్తించగా.. వారిలో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. విచారణ సమయంలో నిందితులు పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. వారు యూట్యూబ్‌ చూసి గన్‌ కాల్చడం నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ముంబైలోని కుర్లా ఏరియాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ యూటూబ్‌ వీడియోలు చూసి, తుపాకీ కాల్చడం నేర్చుకున్నట్లు తెలిపారు. తుపాకీ కాల్చడం నేర్చుకోవడానికి ఓపెన్‌ ప్లేస్‌ లేనందున ఇద్దె గదిలోనే నాలుగు వారాల పాటు వీడియోలు చేసి నేర్చుకున్నామని వెల్లడించారు. అలాగే గన్‌ ఏవిధంగా లోడ్‌ చేయాలి, ఏ విధంగా అన్‌లోడ్ చేయాలి వంటి వివరాలు కూడా యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నట్లు తెలిపారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న గుర్మైల్‌ సింగ్‌, ధర్మరాజ్‌ కశ్మప్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మెయిన్‌ షూటర్‌ శివకుమార్‌ గౌతమ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి ముంబైకి తీసుకువచ్చారు.గౌతమ్ తన స్వస్థలమైన బహ్రైచ్‌లో ఉత్సవ కాల్పుల్లో పాల్గొన్నప్పటి నుంచి ఆయుధాలను వాడటంలో అతనికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా పోయింది. దీంతో అతన్ని మెయిన్ షూటర్‌గా నియమించినట్లు తెలిసింది. గౌతమ్ సింగ్, కశ్యప్‌లు అద్దెగదిలోనే డ్రై ప్రాక్టీస్ చేసేవారు. అంటే బుల్లెట్లు లేకుండా కాల్చడం నేర్చుకున్నారు. ఇక దర్యాప్తులో నిందితులు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా ఉపయోగించినట్లు వెల్లడైంది. నిఘాను నివారించడానికి Instagram, Snapchat వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శుభమ్ లోంకర్ నిందితులందరినీ యాప్‌ల ద్వారా కమ్యూనికేట్ చేయాలని ఫేస్‌బుక్ పోస్ట్‌లో కోరారు. అలాగే హత్యకు 25 రోజుల ముందు వరుకు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా వేసినట్లు తెలిసింది. అరెస్టయిన నిందితుల్లో ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్ లోంకర్ సోషల్ మీడియా యాప్స్‌ వినియోగంలో దిట్ట. జనవరిలో పోలీసులు ఆయుధాల చట్టం కేసులో శుభమ్ లోంకర్‌ను అరెస్టు చేశారు. అయితే అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక పరారీలో ఉన్న శివకుమార్ గౌతమ్, సూత్రధారి మహ్మద్ జీషన్ అక్తర్‌లను అరెస్టు చేయడానికి సర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?