AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: గంగా నదిపై అతిపెద్ద రైలు రోడ్డు వంతెన.. రూ.2,642 కోట్ల వ్యయంతో..

ప్రపంచంలోనే అతి పురాతన నగరం వారణాసిలో అతిపెద్ద రైలు-రోడ్డు వంతెనను నిర్మించనున్నారు. ఈ వంతెనపై ట్రక్కులు, రైళ్లు, కార్లు నడిచే విధంగా నిర్మాణం సాగనుంది. గంగా నదిపై రైలు-రోడ్డు వంతెనతో సహా మల్టీట్రాకింగ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వంతెన ఉత్తరప్రదేశ్‌లోని రెండు జిల్లాలను కలుపుతుంది. ఈ నిర్మాణం వలన లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ వంతెన ద్వారా ప్రయాణం సాగిస్తే వాహనాలు, ట్రక్కులు, రైళ్లలో ఉపయోగించే డీజిల్ కూడా ఆదా అవుతుందని అంచనా.

Uttar Pradesh: గంగా నదిపై అతిపెద్ద రైలు రోడ్డు వంతెన.. రూ.2,642 కోట్ల వ్యయంతో..
Rail Road Bridge In BanarasImage Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 16, 2024 | 6:59 PM

Share

దేశంలోనే అతిపెద్ద రైలు-రోడ్డు వంతెనను దేశంలోని ఆధ్యాత్మిక నగరమైన బనారస్‌లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు డీపీఆర్ రెండేళ్లలో సిద్ధమవుతుంది. ఈ రైలు-రోడ్డు వంతెన బనారస్‌లోని గంగా నది రెండు తీరాలను కలుపుతుంది. ఈ రైలు-రోడ్డు వంతెన 4 రైల్వే ట్రాక్‌లను కలిగి ఉంటుంది. ఈ వంతెనపై 6-లేన్ల హైవే నిర్మించనున్నారు. ఈ వంతెన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనే రెండు జిల్లాలను కలుపుతుందని కేబినెట్ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే గంగా నదిపై ఉన్న మాల్వియా వంతెన పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మాణం చేపట్టనున్నారు. మాల్వియా బ్రిడ్జి దేశంలోనే అత్యంత పురాతనమైన వంతెన. ఇది 137 సంవత్సరాల నాటిది. పాత మాల్వియా వంతెన దగ్గరగా కొత్త వంతెన రానుంది. దేశంలోని ఈ అతిపెద్ద బహుళ-ట్రాకింగ్ వంతెనకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం గురించి తెలుసుకుందాం..

ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు అవుతుందంటే

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ప్రాజెక్టుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేబినెట్ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం అందించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,642 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రద్దీ తగ్గుతుంది. ఈ వంతెన నిర్మాణం రెండు అంతస్తులతో ఉంటుంది. మొదటి అంతస్తులో నాలుగు రైల్వే ట్రాక్‌లు ఉంటాయి. వందే భారత్ రైలు నుంచి లాజిస్టిక్స్ రైలు కూడా ఈ వంతెనపై ప్రయాణించే విధంగా నిర్మాణం జరుగుతుంది. మరోవైపు రెండో అంతస్తులో 6 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. రోడ్డు-కమ్-ట్రైన్ వంతెనపై అదనంగా 24 మిలియన్ టన్నుల కార్గో తరలించే విధంగా నిర్మాణం సాగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

పెరిగే ఉపాధి అవకాశాలు

ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారు. ఈ వంతెన నిర్మాణంలో దాదాపు 10 లక్షల పనిదినాలు ఉండనున్నాయని.. దీని ద్వారా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లోని 2 జిల్లాలను కవర్ చేసే ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 30 కిలోమీటర్ల మేర పెంచుతుంది. ఈ వంతెన కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రవాణా ఖర్చుని కూడా తగ్గిస్తుంది. సమాచారం ప్రకారం ఈ వంతెన CO2 ఉద్గారాలను (149 కోట్ల కిలోగ్రాములు) తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఇది 6 కోట్ల చెట్లను నాటడానికి సమానం.

ఇవి కూడా చదవండి

ఏటా 8 కోట్ల డీజిల్‌ ఆదా

గంగా నదిపై నిర్మించే ఈ వంతెనతో రహదారిలో ప్రయాణం మరింత సులభతరం కానుంది. దీని వల్ల డీజిల్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ఈ వంతెన ద్వారా ఏటా 8 కోట్ల డీజిల్‌ ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే రూ.638 కోట్లు ఆదా చేసేందుకు ఈ వంతెన ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణంలో పెద్ద విషయంగా పరిగణిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం.. జీవనది అయిన గంగా నదిపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి రూపకల్పన, నిర్మాణం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో ఈ వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేయడానికి 2 సంవత్సరాలు పట్టవచ్చని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..