Ratan Tata’s pet dog: రతన్‌టాటా కన్నుమూసిన 3 రోజులకే ఆయన పెట్ డాగ్ ‘గోవా’ మృతి..! శంతను నాయుడు ఏం చెప్పాడంటే

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన మూడు రోజులకే ఆయన పెంపుడు కుక్క గోవా బెంగతో మృతి చెందిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు..

Ratan Tata's pet dog: రతన్‌టాటా కన్నుమూసిన 3 రోజులకే ఆయన పెట్ డాగ్ 'గోవా' మృతి..! శంతను నాయుడు ఏం చెప్పాడంటే
Ratan Tata's Pet Dog
Follow us

|

Updated on: Oct 17, 2024 | 5:25 PM

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) అనారోగ్యంతో అక్టోబర్ 9వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్‌ బారతం కన్నీరు పెట్టుకుంది. అయితే రతన్‌ టాటాకు కుక్కలంటే అమితమైన ప్రేమ అన్నసంగతి కూడా అందరికీ తెలుసు. ఆయన పెంపుడు కుక్క ‘గోవా’ కొన్ని రోజుల క్రితం మృతి చెందిందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. యజమాని రతన్‌టాటా మృతిని తట్టుకోలేక గోవా మృతి చెందిందని నెట్టింట ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు.. రతన్‌ టాటా పెంపుడు శునకం గోవా మృతిపై క్లారిటీ ఇచ్చారు. గోవా సజీవంగానే ఉందని, తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయొద్దంటూ ముంబై పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ స్పష్టం చేశారు.

టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9న మరణించారు. ఆయన వయసు 86. రతన్‌ టాటా మరణించిన మూడు రోజుల తర్వాత గోవా మరణించిందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. టాటా చనిపోయిన కొద్దిరోజులకే కుక్క చనిపోయిందని ఫేక్‌ వార్తలు జోరందుకున్నాయి. బాంబే హౌస్‌లోని టాటా గ్రూప్ కార్యాలయంలో ‘గోవా’ శాశ్వత నివాసి. బాంబే హౌస్‌ని వీధి కుక్కల ఇల్లుగా రతన్‌ టాటా వాటికి అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేశారు. వాటిల్లో ‘గోవా’ రతన్ టాటాకు ఇష్టమైన కుక్క. నిజానికి, గోవాను కూడా రతన్ టాటా అంత్యక్రియలకు తీసుకువచ్చారు. అక్కడ రతన్‌ టాటా పార్ధివ దేహం చూసేందుకు గోవా కుక్కను తీసుకువచ్చారు. ఆ తర్వాత తిరిగి గోవాను బాంబే హౌస్‌కు తీసుకువెళ్లారు.

ప్రస్తుతం గోవా చాలా ఆరోగ్యంగా, సజీవంగా ఉందని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ ధృవీకరించారు. రతన్ టాటా అసిస్టెంట్ శంతను నాయుడు గోవా బాగానే ఉందని ధృవీకరించినట్లు చెప్పారు. ఈ మేరకు ముంబై పోలీసు సుధీర్ కుడాల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి నకిలీ వార్తలను ముందుగా ధృవీకరించకుండా వాటిని నమ్మవద్దని, వాట్సాప్ ఫార్వార్డ్‌ చేయవద్దని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రజలను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.