AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Astrology: సక్సెస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికి బెస్ట్ టైమ్ ఇదే..!

ఉగాది తర్వాత నుంచి జూన్ మొదటి వారం వరకు గ్రహాలన్నీ వరుసగా రాశులు మారడం వల్ల, పైగా జాతక చక్రంలోకి పై భాగంలోనే, అంటే కుంభ రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఇది అనేక విషయాల్లో బాగా అనుకూల సమయంగా కనిపిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇంత కన్నా మంచి సమయం ఉండకపోవచ్చు. ఏదో ఒక నిర్ణయం, ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం మంచిది. అది తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 3:38 PM

Share
మేషం: ఈ రాశి మీద ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం వల్ల బాగా ప్రయోజనం ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించి మీ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి ఇంత కన్నా మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. ఆదాయం పెంచుకోవడానికి, మరింత మంచి సంస్థలోకి మారడానికి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. విజయం మీ వెంటే ఉంటుంది. స్థితిగతుల్లో తప్పకుండా ఆశించిన మార్పు వస్తుంది.

1 / 6
మిథునం: వచ్చే మూడు నెలల కాలం మీకు స్వర్ణయుగం కాబోతోంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మంచి ఉద్యోగానికి, జీవితంలో అన్ని విధాలుగానూ స్థిరపడడానికి తగిన ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. సమయాన్ని వృథా చేయకుండా ఉగాది తర్వాత వెంటనే కార్యరంగంలోకి దిగడం మంచిది. అత్యంత ప్రతిష్ఠాకర సంస్థలోకి మారడానికి, ముఖ్యంగా విదేశీ ఉద్యోగాలు సంపాదించడానికి గ్రహబలం బాగా అనుకూలంగా ఉండబోతోంది.

2 / 6
సింహం: రాబోయే మూడు నెలల కాలం బాగా అనుకూలంగా ఉన్న రాశుల్లో మీరే ముందుంటారు. కాలయాపన చేసినా, బద్ధకించినా సదవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం మీదే అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది. కొద్ది కాలంలో ఉద్యోగంలో స్థిరపడడం, వివాహం చేసుకోవడం, జీవితంలో స్థిరపడడానికి గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి.

3 / 6
తుల: వృత్తి, వ్యాపారాల్లోనే కాక ఉద్యోగంలోనూ ఒక వెలుగు వెలగడానికి ప్రస్తుతం మీకున్నన్ని అవకాశాలు మరెవరికీ లేవని చేప్పవచ్చు. గ్రహాలన్నీ జాతక చక్రం పైభాగంలోనే సంచారం చేయడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, కొత్త ఉద్యోగానికి, ఉద్యోగం మారడానికి, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి మీకు ఉగాది నుంచి గ్రహ బలం బాగా తోడ్పడబోతోంది.

4 / 6
ధనుస్సు: గ్రహాలన్నీ జాతక చక్ర పైభాగంలో సంచారం చేస్తూ మీకు అధియోగం కలిగిస్తున్నందువల్ల మీకు కలలో కూడా ఊహించని ‘అధియోగం’ పట్టబోతోంది. ఒక సంస్థకు సర్వాధికారిగా, అధిపతిగా అవతరించే అవకాశం ఉంది. మీ సారథ్యంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఒక వెలుగు వెలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. పట్టుదలగా ప్రయత్నించి అందలాలు ఎక్కడం మంచిది. బాగా సంపన్నుడయ్యే అవకాశం ఉంది.

5 / 6
మీనం: గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ జరగని విధంగా ఉగాది తర్వాత ఏకంగా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. దీనివల్ల ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత జీవితం ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా అగ్రస్థానాలకు వెళ్లే సూచన లున్నాయి. సొంత ఆలోచనలు, ప్రయత్నాలతో దూసుకుపోవడం మంచిది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విజయాలు, సాఫల్యాలు వరిస్తాయి.

6 / 6
Follow Us