AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..! హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలును ప్రారంభించిన ఇరాన్!

అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ 2 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ. 20 కోట్లు సుంకాన్ని వసూలు చేయాలనున్నట్లు ఒక నిఘా నివేదిక వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌక నుంచి ఇరాన్ సుంకం వసూలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.

ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..! హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలును ప్రారంభించిన ఇరాన్!
Toll Collection In Strait Of Hormoz
Balaraju Goud
|

Updated on: Mar 20, 2026 | 3:18 PM

Share

అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ 2 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ. 20 కోట్లు సుంకాన్ని వసూలు చేయాలనున్నట్లు ఒక నిఘా నివేదిక వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌక నుంచి ఇరాన్ సుంకం వసూలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఇరాన్ నౌకలు ఎలాంటి సుంకం చెల్లించకుండా, ఉచితంగా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేవి. అయితే, దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.

లాయిడ్ ఇంటెలిజెన్స్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం, పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ సమీపంలో ఒక సురక్షిత కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఈ కారిడార్ లేకర్ ఐలాండ్ సమీపంలో ఉంది. ఇప్పటివరకు అక్కడి నుంచి తొమ్మిది నౌకలను తరలించారు. ఈ నౌకలలో ఒకటి, తమ నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ధృవీకరించింది. ఈ నివేదిక ప్రకారం, హోర్ముజ్ జలసంధి నుండి ఖాళీ చేసిన తొమ్మిది నౌకలలో భారతదేశం, చైనా, పాకిస్తాన్, మలేషియాకు చెందిన నౌకలు ఉన్నాయి. అయితే, ఈ నౌకలలో ఎన్ని ఏ దేశానికి చెందినవి అనే వివరాలు అందించలేదు. ఇరాన్ ఈ కారిడార్‌ను ఒక దౌత్యపరమైన చొరవగా ఏర్పాటు చేసిందని వర్గాలు చెబుతున్నాయి. అయితే, మిత్ర, శ్రేయోభిలాష దేశాల నౌకలను మేము ప్రయాణించడానికి అనుమతిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను తగ్గించడానికి ఒక కూటమిని అమెరికా నిర్మిస్తోంది.

హోర్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక జలసంధి, ఇది వాణిజ్య దృక్కోణంలో చాలా ముఖ్యమైనది. గా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలు ఎలాంటి రవాణా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఓడలపై 2 మిలియన్ డాలర్ల ఛార్జీ విధించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటువంటి పన్నులు విధించడం ద్వారా ఇరాన్ తన రెండు స్వప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నిస్తోంది.

గురువారం (మార్చి 19, 2026) మెహర్ న్యూస్‌తో ఇరాన్ ఎంపీ మహమ్మద్ ముఖ్‌బెర్ మాట్లాడుతూ, “మా ప్రాంతాలపై మేము పన్ను విధిస్తాము. మాపై ఆంక్షలు విధించిన దేశాలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై వాణిజ్యం ఇరువైపులా జరుగుతుంది” అన్నారు. కాగా, యుద్ధం తర్వాత హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఒక ప్రోటోకాల్ కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పిలుపునిచ్చారు. హోర్ముజ్ జలసంధి ఇప్పటికీ తన నియంత్రణలో ఉందని నిరూపించుకోవడానికి ఇరాన్ ఈ పన్నును ఉపయోగిస్తుంది. ఇటీవల, హోర్ముజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us