AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలంలో ప్రక్షాళన షురూ.. ఒకేసారి 23 మంది ఉద్యోగులపై బదిలీ వేట!

నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి యువ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Srisailam: శ్రీశైలంలో ప్రక్షాళన షురూ.. ఒకేసారి 23 మంది ఉద్యోగులపై బదిలీ వేట!
Srisailam Temple
Balaraju Goud
|

Updated on: Aug 02, 2026 | 7:32 AM

Share

నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి యువ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, మరిన్ని బదిలీలు కూడా ఉండే అవకాశముందన్న ప్రచారం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది.

శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అంతర్గత బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ఆలయ ఈవో యువ శ్రీనివాసరావు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీల్లో భాగంగా కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అలాగే ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూ అదనపు విధులను అప్పగించారు. వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు.

దేవస్థానంలో ప్రతి విభాగం పనితీరు మెరుగుపడేలా, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈవో యువ శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులను వెంటనే అప్పగించి, కొత్తగా కేటాయించిన విభాగాల్లో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరిస్తున్నారు.

అయితే ఒకేసారి 23 మంది ఉద్యోగులకు బదిలీలు జరగడం దేవస్థాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పరిపాలనా వ్యవస్థలో చేపడుతున్న మార్పులకు కొనసాగింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, నేడు లేదా రాబోయే రోజుల్లో మరికొందరు ఉద్యోగులకు కూడా అంతర్గత బదిలీలు జరిగే అవకాశముందని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. దీంతో శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళన ఇంకా కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు