AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కీర్తి సురేష్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

మహానటి కీర్తి సురేష్ ఇటీవల ది ప్యారడైజ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇది పెద్ద విషయం కాదు.. కానీ.. డోరోతి అనే తమిళ సినిమాలో బోల్డ్ గా నటించింది అందరికీ షాక్ ఇచ్చిందీ అందాల తార. ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

OTT Movie: కీర్తి సురేష్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
Akka Web Series
Basha Shek
|

Updated on: Sep 29, 2026 | 5:48 PM

Share

మహానటి కీర్తి సురేష్ ఈ మధ్యన బిజీ బిజీగా ఉంటోంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటోంది. అలాగే స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘ది ప్యారడైజ్’ మూవీలో ఏషనాగుల పాటలో నానితో కలిసి స్టెప్పులేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. అయితే గత వారమే రిలీజైన డోరోతి అనే తమిళ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది మహానటి. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. . అదే.. ‘అక్క’ వెబ్ సిరీస్. ఇందులో కీర్తి సురేష్ తో పాటు మరో బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే లీడ్ రోల్స్ ప్లే చేసింది. గతేడాదే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజైంది. అయితే దీని తర్వాత మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై ఓ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 30 నుంచి అక్క వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుందని టాక్. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

కాగా అక్క కీర్తి సురేష్ నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం. పైగా ఇందులో ఆమె గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండడంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి. ఇందులో కీర్తితో పాటు రాధికా ఆప్టే, సీనియర్ నటి తన్వీ అజ్మీ, విశాఖ్ నాయర్, దివ్యా శ్రీపాద తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డిజిటల్ వింగ్ అయిన YRF ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ధర్మరాజ్ శెట్టి అక్క వెబ్ సిరీస్ కు కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!
కొత్తగా యోగా మొదలుపెడుతున్నారా? ఇంట్లోనే ఈజీగా చేసేందుకు..
కొత్తగా యోగా మొదలుపెడుతున్నారా? ఇంట్లోనే ఈజీగా చేసేందుకు..
చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన సంజూ
చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన సంజూ
రూ.200 పెట్టుబడితో.. రూ. 4లక్షల రాబడి! పోస్టాఫీస్‌ నుంచి..
రూ.200 పెట్టుబడితో.. రూ. 4లక్షల రాబడి! పోస్టాఫీస్‌ నుంచి..
కాశీకివెళ్తున్నారా? ఈ 5 అనుభవాలను అస్సలు మిస్ కాకండి!
కాశీకివెళ్తున్నారా? ఈ 5 అనుభవాలను అస్సలు మిస్ కాకండి!