AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?

Guntur Car Fire Tragedy: గుంటూరులోని ఐపిడి కాలనీలో నివసించే హరి క్రిష్ణ డయాలసిస్ కోసం కొడుకు అఖిలేష్‌తో కలిసి కారులో ఆసుపత్రికి వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. వారి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెనుక సీట్లో ఉన్న హరి క్రిష్ణ మృతి చెందారు. కారు నడుపుతున్న కొడుకు అఖిలేష్ స్థానికుల సహాయంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?
Car Fire Accident
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 3:39 PM

Share

గుంటూరు ఐపిడి కాలనీలో నివాసం ఉండే హరి క్రిష్ణ కొన్నేళ్లుగా కిడ్ని వ్యాధితో బాధపడుతున్నాడు. కాటన్ బయ్యర్‌గా పనిచేసిన హరిక్రిష్ణకు వ్యాధి ముదరడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. 55 ఏళ్ల తండ్రిని చూసుకునేందుకు కొడుకు అఖిలేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి వచ్చి తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంది. తొమ్మది గంటల సమయంలో తండ్రీకొడుకులిద్దరూ కారులో ఆసుపత్రికి బయలు దేరారు.

అఖిలేష్ కార్ డ్రైవ్ చేస్తుండగా.. హరిక్రిష్ణ వెనుక సీట్లో కూర్చుకొన్నాడు. అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత డాక్టర్ అందుబాటులో లేడని తెలిసి తిరిగి ఇంటికి బయలు దేరారు. మరి కొద్దీ అడుగుల్లోనే అపార్ట్ మెంట్‌లోకి వెళతారనగా కారులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అఖిలేష్ కారు నిలపివేశాడు. ఒక్కసారిగా కారులో మంటలు రావడం మొదలయింది. కారు డోర్స్ కూడా వెంటనే లాక్ అయ్యాయి. మంటలు గమనించిన వెంటనే స్థానికులు… అఖిలేష్ వైపు ఉన్న డోర్ అద్దం ధ్వంసం చేసి డోర్ ఓపెన్ చేశారు. అప్పటికే అఖిలేష్ కి మంటలు అంటుకోవడతో స్వల్ప గాయాలయ్యాయి. అటు వైపు ఉన్న హరిక్రిష్ణ వైపుకు వెళ్లేసరికి మంటల విస్త్రుతి పెరిగిపోయింది. దీంతో అతని రక్షించలేకపోయారు.

మంటలు భారీగా వ్యాపించడంతో కారు వెనుక సీటులో కూర్చొన్న హరిక్రిష్ణ మంటలు ఆహూతయ్యాడు. స్థానికులు మంటలు ఆర్పినప్పటికీ.. అప్పటికే హరిక్రిష్ణ చనిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. డీజిల్ కారులో ఏసీ పేలడంతోనే మంటలు వ్యాపించి ఉంటాయన్న భావన వ్యక్తం అవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us