AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October 2026 Horoscope: ఈ రాశులకు అక్టోబర్‌లో ఆర్థికం, కెరీర్‌లో భారీ శుభవార్తలు! మీ రాశికి ఇలా..

మాస ఫలాలు (అక్టోబర్ 1-31, 2026): మేష రాశి వారు ఈ నెలలో ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది.నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, జీతభత్యాలు పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి అక్టోబర్ 2026 మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 3:14 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కొద్దిగా ఏలిన్నాటి శని దోషం మినహాయించి, మిగిలిన గ్రహాల్లో చాలా భాగం బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నెలంతా ఆశించిన విధంగా ఉజ్వలంగా, వైభవంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు లాభాల పంట పండి స్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విందులు, వినోదాలు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా అనుకోకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి అధికార యోగం పడుతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల వ్యవహార జయం ఉంటుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశికి శని, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల నెల ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం చాలా బాగుంటుంది. ద్వితీయార్థం సీదా సాదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, జీతభత్యాలు పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ద్వితీ యార్థంలో ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నెలంతా ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. అనవసర ఖర్చులు తగ్గిం చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి, ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధన స్థానంలో ఉన్న గురువు ఈ నెలంతా పూర్తి స్థాయిలో ఆదాయవృద్ధిని కలిగించే అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానం సంచారంతో శుభ యోగాలనివ్వడం ప్రారంభం అవుతుంది. అక్టోబర్ నెలంతా మీరు ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో గానీ, షేర్లలో గానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణ యాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. కుజుడు, శుక్రుడు, బుధ, రవులు కూడా ప్రథమార్థంలో బాగా అనుకూలం కాబోతున్నారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. ఎంతో సమయ స్ఫూర్తితో వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.  ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్త వుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు. తరచూ శివార్చన చేయించడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలకు అవకాశం ఉంటుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ నెల అష్టమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు బాగా ఆలస్యం అవుతాయి. రాశ్యధిపతి రవి ధన స్థానంలో ఉండడం వల్ల నెల ప్రథమార్థమంతా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. సప్తమ స్థానంలో  రాహువు సంచారం వల్ల దాంపత్య జీవితం కొద్దిగా ఒడిదుడుకులతో సాగుతుంది. నెల ద్వితీయార్థంలో రాశ్య ధిపతి రవి తృతీయంలో నీచబడుతున్నందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. శుక్ర, బుధ గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త,  చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో, ధన స్థానాధిపతి శుక్రుడు ధన స్థానంలో, గురువు లాభ స్థానంలో సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా వెడతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. తరచూ దుర్గాదేవిని అర్చించడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల శని, కుజుల ప్రభావం బాగా తగ్గిపోతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి శని, బుధ, శుక్ర, గురువుల అనుకూలత వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలావరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఈ నెల మొదటి వారంలో శుక్ర, బుధులు వక్రి స్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీదా, కుటుంబ వ్యవహారాల మీదా శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ రాశివారు ద్వితీయార్థంలో ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో ప్రతి పనీ నెరవేరుతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా శుభ ఫలితాలనిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆశించిన విజయాలను ఇస్తాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. పంచమ స్థానంలో శని సంచారం వల్ల బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. విశ్రాంతికి కూడా తీరిక ఉండదు. చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల అనవసర వ్యయానికి, అనవసర పరిచయాలకు, వ్యసనాలకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. సుందరకాండను పారాయణం చేయడం వల్ల ఒత్తిళ్లు తగ్గుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ నెలంతా లాభ స్థానంలో బుధ, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వ్యాపార పెట్టుబడులు బాగా లాభిస్తాయి. రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల ఆస్తి లాభానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు, పెండింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, రావలసిన డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో రాబడి అంచనా లకు మించి పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. తల్లితండ్రులతో, తోబుట్టు వులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కుటుంబంలో మధ్య మధ్య టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. విష్ణు సహస్ర నామ పఠనం చాలా మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ నెల ఫలితాలు బాగా అనుకూలంగా ఉంటాయి. తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని, సప్తమంలో గురువు ఉచ్ఛ స్థితి, దశమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరి స్థితి ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల్ని, ప్రధాన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ స్థానంలో రాహువు సంచారం వల్ల కొద్ది శ్రమతో ఎక్కువ లాభాలు పొందు తారు. ఆర్థికంగా, కుటుంబపరంగా సానుకూలతలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. శివార్చన చేయించడం వల్ల మేలు కలుగుతుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని జరుగుతున్నప్పటికీ, భాగ్య స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ నెలంతా చాలా వరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరంగా కొన్ని సానుకూలతలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు లబ్ధి చేకూరుస్తాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. షష్ఠ స్థానంలో ఉన్న గురు, కుజుల వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరు ద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృథా ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. శనికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమస్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, కుజుడితో యుతి చెందడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజ నాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయంలో మెరుగుదల, ఎదుగు దల ఉంటాయి కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

12 / 12
Follow Us