మచ్చలేని, మెరిసే చర్మం కావాలంటే.. రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి!

Jyothi Gadda

29 September 2026

రాత్రి పడుకునే ముందు ముఖంపై ఉన్న మేకప్‌ను మైసెలార్ వాటర్ లేదా రోజ్ వాటర్‌తో పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

మేకప్ తొలగించడం

మేకప్ తీసేసిన తర్వాత చర్మానికి సరిపోయే మైల్డ్ ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కుని మురికి, జిడ్డును తొలగించాలి.

ఫేస్ వాష్ వాడకం

ముఖం శుభ్రం చేశాక టోనర్ అప్లై చేయడం వల్ల చర్మం పి.హెచ్ స్థాయి సమతుల్యంగా ఉండి రంధ్రాలు బిగుతుగా మారతాయి.

టోనర్ ఉపయోగించడం

పడుకునే ముందు అలోవెరా జెల్ రాయడం వల్ల చర్మం తేమగా మారడమే కాకుండా మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

కలబంద జెల్

పొడి చర్మం ఉన్నవారు రాత్రి వేళ కొద్దిగా కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

కొబ్బరి నూనె

 చర్మాన్ని పోషించడానికి, పునరుజ్జీవింపజేయడానికి విటమిన్ సి సీరమ్ లేదా నైట్ మోయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం చాలా శ్రేయస్కరం.

నైట్ క్రీమ్ లేదా సీరమ్

కంటి కింద నల్లటి వలయాలు తగ్గడానికి రోజూ రాత్రి అండర్ ఐ క్రీమ్ రాసి మెల్లగా మర్దన చేయాలి.

అండర్ ఐ క్రీమ్

ఇన్ని చిట్కాలు పాటించడంతో పాటు ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నిద్రపోతేనే చర్మం ఆరోగ్యంగా, రోజంతా కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

అండర్ ఐ క్రీమ్