Chiranjeevi Balakrishna: బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇండస్ట్రీలోనే పెద్ద నిర్మాత.. టాప్ డైరెక్టర్ భార్య..
ప్రస్తుతం ఓ చిన్నారి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు బాలకృష్ణ, చిరంజీవి మధ్య నిలబడి అందంగా, అమాయకంగా నవ్వుతూ కనిపించింది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఆమె తోపు నిర్మాత. అంతేకాదు స్టార్ డైరెక్టర్ భార్య కూడా . కోట్ల బడ్జెట్ చిత్రాలతో సక్సెస్ అయ్యింది. ఇంతకీ మీకు తెలుసా ఆ అమ్మాయి గురించి.

సోషల్ మీడియా ప్రపంచంలో సినీ ప్రముఖులకు సంబంధించిన అరుదైన ఫొటోలు, చిన్ననాటి ముచ్చట్లు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు , ప్రముఖుల చైల్డ్‌హుడ్ పిక్స్ నెట్టింట ప్రత్యక్షమవ్వగానే అభిమానులు వాటిని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. తాజాగా అలాగే టాలీవుడ్‌కు చెందిన ఓ రేర్ ఫొటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో టాలీవుడ్ రెండు కళ్లుగా నిలిచే దిగ్గజ కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కనిపించారు. అయితే, వారిద్దరి మధ్యలో ఎంతో అమాయకంగా, ముద్దులొలికే రూపంతో నిలబడి ఉన్న ఆ చిన్నారిని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ చిన్నారి ఎవరో కాదు… టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాత వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ ముద్దుల కుమార్తె ప్రియాంక దత్.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..
చిన్నతనంలోనే సినీ వాతావరణంలో పెరిగిన ప్రియాంక దత్, పెద్దయ్యాక తండ్రి బాటలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కేవలం అశ్విని దత్ కుమార్తెగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ‘త్రీ ఏంజిల్స్ స్టూడియో’ బ్యానర్‌ను స్థాపించి ‘బాణం’, ‘ఓం శాంతి’, ‘సారొచ్చారు’ వంటి వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు. నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన ‘బాణం’ సినిమా నిర్మాణానికి గాను ఆమె ప్రతిష్టాత్మకమైన వెండి నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అంతేకాకుండా ‘బాలు’, ‘జై చిరంజీవ’ వంటి పెద్ద చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..
తన సోదరి స్వప్న దత్‌తో కలిసి వైజయంతీ మూవీస్ పతాకంపై ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ వంటి బాక్సాఫీస్ క్లాసిక్స్ నిర్మించారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక, ఆయన దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ దృశ్యకావ్యం ‘కల్కి 2898 AD’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణల మధ్య చిన్నారిగా ముద్దుగా కనిపించిన ప్రియాంక దత్, నేడు టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన మహిళా నిర్మాతగా ఎదగడంపై నెటిజన్లు, సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఆమె డైరెక్టర్ నాగ్ అశ్విన్ సతీమణి కూడా. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..
ప్రియాంక దత్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..
