OTT Movie: నాలుగు నెలల తర్వాత.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. IMDBలో 7.5 రేటింగ్
సుమారు నాలుగు నెలల క్రితం ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అయితే స్టార్ నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. ఇప్పుడీ లవ్ స్టోరీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. దాదాపు 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నాని ది ప్యారడైజ్, కీర్తి సురేష్ డోరతి, ధూమకేతు, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో రిలీజైంది. ఉన్నంతలో యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమా త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 7.5 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక మారుమూల గ్రామంలో నివసించే సాధారణ యువకుడు దుర్గా దేవ్ నాయుడు. అదే ఊరికి మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి సిటీ నుంచి డాక్టర్ (అన్విష) వస్తుంది. ఆమెను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడతాడు దుర్గా దేవ్ నాయుడు. మరి ఒక పల్లెటూరి యువకుడు, చదువుకున్న సిటీ డాక్టర్ మనసును గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? వీరి ప్రేమ ఫలించిందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా ప్రేమికులకు సమాజంలో ఎదురువుతోన్న సామాజిక, కుటుంబ సమస్యలు తదితర అంశాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ పేరు ‘ఐ యామ్ హ్యాండ్సమ్’. ఈ సినిమాలో దుర్గాదేవ్ నాయుడు హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. హీరోయిన్ గా అన్విష క్యూట్ గా కనిపించిందవి. అలాగే కిట్టయ్య, రూప కళ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక సారి ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ సినిమాపై ఒక లుక్కేసుకోవచ్చు.
‘ఐ యామ్ హ్యాండ్సమ్’ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




