AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఐడియా అదుర్స్‌.. కోతుల బెడదకు చెక్‌ పెట్టేందుకు వృద్ధురాలి వినూత్న ప్రయత్నం!

నిత్యం రోడ్డు పక్కన పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలిని కోతులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తాను విక్రయిస్తున్న వాటిలో సగం పండ్లు కోతులే ఎత్తుకెళ్తున్నాయి. దీంతో విసిగిపోయిన ఆ వృద్దురాలు కొతులకు చెక్‌ పెట్టేందుకు వినూత్న ఆలోచన చేసింది. తన వ్యాపారాన్ని కాపాడుకునేందుకు తన చుట్టూ జాలిని ఏర్పాటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్దురాలి ఐడీ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telangana: ఐడియా అదుర్స్‌.. కోతుల బెడదకు చెక్‌ పెట్టేందుకు వృద్ధురాలి వినూత్న ప్రయత్నం!
Telangana Elderly Woman Builds Net Enclosure To Sell Fruits Safely
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 7:22 PM

Share

ఈ మధ్య కాలంలో కోతుల బెడద ఎక్కవపోతుంది. ఏ గ్రామంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా తిరగుతూ జనాలను తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలానే వ్యాపారం చేసుకునే ఓ వృద్దురాలి కూడా కోతులు రోజూ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాయి. దీంతో విసిగిపోయిన ఆ వృద్దురాలు వాటికి చెక్‌ పెట్టేందుకు అదిరిపోయే ఆలోచన చేసింది. కోతులు తన పండ్లను ఎత్తుకెళ్లకుండా చూట్టూ జాలిని కట్టుకొని వ్యాపారం కొనసాగించడం స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ ప్రధాన రహదారి పక్కన ఓ వృద్దురాలు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కోతులు బెడద కూడా ఎక్కువే.. దీంతో ఆ కోతులు రోజూ ఆ వృద్దురాలు వద్దకు వచ్చి ఆమె అమ్మకానికి ఉంచిన పండ్లన్నింటినీ ఎత్తుకెళ్తున్నాయి. దీంతో పొద్దంతా కూర్చున్నా ఆ వృద్దురాలికి కనీసం కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. అలాగని వ్యాపారం మానివేద్దామంటే కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే కోతుల నుంచి ఎలాగైనా తన వ్యాపారాన్ని కాపాడుకోవాలనే నిర్ణయించుకున్న ఆ వృద్దురాలు వినూత్న ఆలోచన చేసింది. కోతు పండ్లను ఎత్తుకెళ్లకుండా తాను కూర్చున్న స్థలం చుట్టూ ఓ జాలిని ఏర్పాటు చేసుకుంది. కస్టమర్లు వచ్చినప్పుడు ఆ జాలిని పక్కకు జరిపి పండ్లను విక్రయించడం మొదలు పెట్టింది. దీంతో కోతులు పండ్లను ఎత్తుకెళ్లడానికి ఆస్కారం లేకుండా పోయింది.

ఈ విధంగా జాలి ఏర్పాటు చేసుకోవడంతో కోతుల బెడద నుంచి బయటపడ్డానని ఆమె పేర్కొంది. ఇలా కూర్చోవడం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వ్యాపారం కోసం తప్పడం లేదని తెలిపింది. జాలి ఉండటంతో కోతులు అటువైపు రావడం లేదని, ఒకవేళ వచ్చినా జాలి కారణంగా పండ్లు ఎత్తుకుపోయే అవకాశం లేకుండా పోయిందని చెప్పింది. ఇక్కడ వందలాది కోతులు ఉన్నాయని, క్షణంలోనే పండ్లన్నింటినీ ఎత్తుకెళ్తాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ జాలి ఏర్పాటుతో కోతుల బెడద నుంచి రక్షణ లభించిందని వెల్లడించింది.

వీడియో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us