AP ఇంటర్ పబ్లిక్ పరీక్షల 2027 టైమ్‌టేబుల్ విడుదల.. ఏ తేదీన ఏయే పరీక్షలంటే?
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (థియరీ) తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి..

అమరావతి, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (థియరీ) తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షలకు ముందుగానే సిద్ధమవుతూ, సబ్జెక్టుల వారీగా పునశ్చరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్
- ఫిబ్రవరి 24, 2027: భాషా పేపర్–I, సంబంధిత సబ్జెక్టుల పేపర్–I
- ఫిబ్రవరి 26: ఇంగ్లిష్ పేపర్–I
- మార్చి 1: గణితం/పౌరశాస్త్రం పేపర్–I
- మార్చి 3: జీవశాస్త్రం/చరిత్ర పేపర్–I
- మార్చి 5: భౌతికశాస్త్రం/ఆర్థికశాస్త్రం పేపర్–I
- మార్చి 9: రసాయనశాస్త్రం/వాణిజ్యశాస్త్రం పేపర్–I
- మార్చి 12: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్–I
- మార్చి 15: ఆధునిక భాషలు/భూగోళశాస్త్రం పేపర్–I
ఇంటర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్
- ఫిబ్రవరి 25, 2027: భాషా పేపర్–II, సంబంధిత సబ్జెక్టుల పేపర్–II
- ఫిబ్రవరి 27: ఇంగ్లిష్ పేపర్–II
- మార్చి 2: గణితం/పౌరశాస్త్రం పేపర్–II
- మార్చి 4: జీవశాస్త్రం/చరిత్ర పేపర్–II
- మార్చి 8: భౌతికశాస్త్రం/ఆర్థికశాస్త్రం పేపర్–II
- మార్చి 11: రసాయనశాస్త్రం/వాణిజ్యశాస్త్రం పేపర్–II
- మార్చి 13: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/లాజిక్ పేపర్–II
- మార్చి 16: ఆధునిక భాషలు/భూగోళశాస్త్రం పేపర్–II
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
పాత సిలబస్ విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల పరీక్షల తేదీలు, పేపర్ల వివరాలు ప్రత్యేకంగా వర్తిస్తాయి. విద్యార్థులు తమ సిలబస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. సాధారణ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తి విద్యా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఆదివారాలు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్: 2027 జనవరి 27, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్: 2027 జనవరి 29, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. సమగ్ర శిక్ష వృత్తి విద్యా కోర్సుల NSQF Level-4 థియరీ పరీక్ష ఫిబ్రవరి 17, 2027న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ టైమ్‌టేబుల్ తాత్కాలికమైనది. ప్రభుత్వం ప్రకటించే సెలవుల కారణంగా కొన్ని పరీక్షల తేదీల్లో మార్పులు ఉండవచ్చు. వృత్తి విద్యా కోర్సుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. కాబట్టి విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి వచ్చే అధికారిక ప్రకటన ఆధారంగా పరీక్షల సన్నద్ధతను కొనసాగించాల్సి ఉంటుంది.




