రోడ్డు పక్కన బండిపై దొరికే చల్లా పునుగులు ఇంట్లోనే.. చుక్క నూనె కూడా పీల్చకుండా ఇలా చేయండి!
రోడ్డు పక్కన బండ్లపై వేడివేడిగా లభించే చల్లా పునుగులు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. బయటకు కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పునుగులను చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు. అయితే వీటిని తినాలనిపించిన ప్రతిసారీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ పదార్థాలతో రుచికరమైన చల్లా పునుగులను తయారు చేసుకోవచ్చు. మైదా పిండితో పాటు పెరుగు, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వంటి పదార్థాలతో ఈ పునుగులను తయారు చేయవచ్చు. ముఖ్యంగా పిండి సరైన చిక్కదనంతో ఉండేలా చూసుకుంటే పునుగులు చక్కగా పొంగి, మంచి ఆకారంలో వస్తాయి. వీటికి జతగా పలుచని పచ్చి శెనగపప్పు చట్నీ తయారు చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా రోడ్డు పక్కన బండ్లపై దొరికే రుచికరమైన చల్లా పునుగులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
