AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: ఒక్కసారి ఈ పథకంలో చేరితే ప్రతీ నెలా రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్.. ఇలా దరఖాస్తు చేస్కోండి..

వయస్సులో ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తుండటం వల్ల స్థిరమైన ఆదాయం ఉంటుంది. అదే 60 ఏళ్ల రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత స్థిరమైన ఆదాయం అంటూ ఏదీ ఉండదు. దీంతో అప్పటికోసం ఇప్పటినుంచే రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాంటివారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్బత పథకం అమలు చేస్తోంది.

Central Government: ఒక్కసారి ఈ పథకంలో చేరితే ప్రతీ నెలా రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్.. ఇలా దరఖాస్తు చేస్కోండి..
Atal Penison Yojana Scheme
Venkatrao Lella
|

Updated on: Oct 23, 2026 | 6:01 PM

Share

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం పెన్షన్ ప్రయోజనాలు కల్పిస్తోంది. కానీ అసంఘటిత రంగాల్లో కార్మికులకు పనిచేసేవారికి ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవ్. దీంతో రిటైర్మెంట్ తర్వాత వారికి స్థిరమైన ఆదాయం అంటూ ఏదీ ఉండదు. అలాంటివారికి కూడా పదవీ విరమణ తర్వాత పెన్షన్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం అటల్ పెన్షన్ యోజన(APY) స్కీమ్ ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఇందులో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వా ప్రతీ నెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. పెన్షన్‌దారుడు మరణిస్తే నామినీకి పెన్షన్ అందిస్తారు. ఈ స్కీములో ఎలా చేరాలి? అర్హతలేంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

అటల్ పెన్షన్ యోజన(APY) పథకం ఏంటి..?

కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న ఈ పథకాన్ని ప్రారంభించింది. అసంఘటిత రంగంలో పనిచేసేవారు స్వచ్చంధంగా ఇందులో చేరవచ్చు. పేద కార్మికులకు ఇది వృద్దాప్య ఆదాయ భద్రతను అందిస్తోంది. పదవీ విరమణ కోసం తమ నిధులను పొదుపు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పటికే కోట్లాదిమంది ఈ పథకంలో సభ్యులుగా ఉన్నారు. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఈ పథకంలో పొందవచ్చు.

ఎవరెవరు చేరవచ్చు..?

-వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

-భారతీయు పౌరులై ఉండాలి

-ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు

-ఎన్నారైలు ఈ పథకానికి అర్హులు కాదు

-ఆథార్ ప్రమాణిక కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది

APY పథకంలో చేరడం ఎలా..?

మీ సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా ఈ స్కీములో సులువుగా చేరవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. అటల్ పెన్షన్ యోజన అప్లికేషన్ ఫారంను పూర్తి చేసి అందించాలి. నెలావారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది విధానాల్లో ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు చేరే వయస్సు, మీరు ఎంచుకునే పెన్షన్ పరిమితిని బట్టి ప్రీమియం ఎంత చెల్లించాలనేది ఫిక్స్ చేస్తారు. మీరు తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నారనే దాని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీనెలా రూ.వెయ్యి, రూ.2 వేలు, రూ.3 వేలు, 4 వేలు, రూ.5 వేల పెన్షన్లలో ఏ కేటగిరీలో చేరాలనేది నిర్ణయించుకోవాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా రూ.వెయ్యి కావాలనుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. రూ.5 వేల కావాలనుకుంటే కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మీరే 60 ఏళ్లు వచ్చేంతవరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రతీ నెలా పెన్షన్ అందుతుంది.

Follow Us