రాగులు ఆరోగ్యానికి మంచివే కానీ.. వీళ్లకు డేంజర్!
Jyothi Gadda
23 october 2026
రాగులలో ఆక్సలేట్లు అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకపోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
రాగుల్లో లభించే గోయిట్రోజెన్లు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి కాబట్టి, హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.
రాగుల్లో పీచు పదార్థం (ఫైబర్) చాలా ఎక్కువగా ఉండటం వల్ల, సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారిలో కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు వస్తాయి.
రోజూ పరిమితికి మించి రాగి జావ లేదా రాటి వంటకాలు తీసుకోవడం వల్ల కొందరిలో మలబద్ధకం, విరేచనాల సమస్యలు కలుగుతాయి.
పుట్టుకతోనే లేదా సెన్సిటివిటీ కారణంగా కొందరికి రాగులు పడకపోవచ్చు, అలాంటివారిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలెర్జీలు వస్తాయి.
బరువు పెరగాలని ఆశపడేవారు రాగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు, ఎందుకంటె ఇది త్వరగా కడుపు నిండేలా చేస్తుంది.
కిడ్నీ సంబంధిత తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు, డాక్టర్ల సలహా మేరకే తమ డైట్‌లో రాగులను మితంగా చేర్చుకోవాలి.
ఏదైనా సరే సమతుల్య ఆహారంగా మితంగా తీసుకున్నప్పుడే శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి కాబట్టి రాగులను కూడా తగిన మోతాదులోనే తినాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!