AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. అమెరికాలో ఖమ్మం యువతి వాకింగ్ చేస్తుండగా ఊహించని ఘటన.. ఏం జరిగిందంటే..?

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఓ తెలుగు యువతి హఠాన్మరణం అందరినీ కలచివేస్తోంది. ఖమ్మం నగరానికి చెందిన వర్తక సంఘం నేత నల్లమల్ల ఆనంద్ కూతురు అక్షిత అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటుంది. ఎప్పటిలాగే వాకింగ్ చేస్తుం ఊహించని ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అయ్యో దేవుడా.. అమెరికాలో ఖమ్మం యువతి వాకింగ్ చేస్తుండగా ఊహించని ఘటన.. ఏం జరిగిందంటే..?
Khammam Girl Dies In Us
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 5:43 PM

Share

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తుందనుకున్న ఓ యువతిని విధి వంచించింది. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఖమ్మం నగరానికి చెందిన యువతి నల్లమల్ల అక్షిత (27) గుండెపోటుతో మరణించారు. ఇంట్లో వాకింగ్ చేస్తూ ఆమె అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం నగర వర్తక సంఘం దిగుమతుల శాఖ అధ్యక్షులు నల్లమల్ల ఆనంద్ కుమార్తె అయిన అక్షిత.. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం తన నివాసంలో వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు వచ్చింది. తీవ్రమైన నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఆమె క్షణాల్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

తీరని శోకంలో కుటుంబం

కూతురు విదేశాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతుందని కలలు కన్న తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇకలేరనే చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్షిత మరణవార్త తెలియడంతో నల్లమల్ల ఆనంద్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక వర్తక సంఘం ప్రతినిధులు, బంధుమిత్రులు వారి నివాసానికి చేరుకుని ఆనంద్ దంపతులను ఓదారుస్తూ, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

అక్షిత పార్థివ దేహాన్ని ఖమ్మంలోని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సంబంధిత అధికారులను, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. 27 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో యువతి మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

Follow Us