AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం ఉండబోతుంది. మరి మీ జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుందిది? వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు..
Andhra Pradesh Telangana Weather Alert
Krishna S
|

Updated on: Sep 29, 2026 | 2:55 PM

Share

బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. కర్ణాటక మీదుగా ఉన్న పాత ద్రోణి ఇందులో విలీనమైంది.

ఆంధ్రప్రదేశ్ – యానాం వాతావరణ సూచన

ఇవాళ లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కొనసాగుతాయి.

రాయలసీమ

వచ్చే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ వాతావరణ సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. బుధ, గురువారాల్లో వర్ష ప్రభావం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

రైతులు, ప్రజలకు సూచన

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు సూచించారు. కోతకు వచ్చిన పంటల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Follow Us