మరీ ఇంత క్యూట్ గా ఉంటే ఎలా అండి.. కవ్విస్తున్న అనన్య 

29 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ ఉన్న కొత్త తరం కథానాయికలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటి అనన్య నాగళ్ల కూడా ఒకరు. 

అందం, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ .

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న కథల్లో కనిపించడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది అనన్య. 

అనన్య నాగళ్ల కెరీర్ షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభమైంది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమెకు ప్రారంభంలోనే మంచి అవకాశాలు లభించాయి.

అనన్య నాగళ్ల కెరీర్‌లో మల్లేశం సినిమా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోసిన అనన్య, ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం అనన్య నాగళ్లకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ వయ్యారి భామ.