AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC నుంచి AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. CBRT, CPT ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది..

APPSC నుంచి AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం
APPSC AEE Notification
Srilakshmi C
|

Updated on: Sep 29, 2026 | 4:06 PM

Share

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు మరో నోటిఫికేషన్ అందించింది. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, పేపర్-2లో కామన్ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. CBRTలో అర్హత సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో విద్యార్హత, వయోపరిమితి, సబ్జెక్ట్ వారీ అర్హతలు, ఫీజు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

దరఖాస్తు తేదీలు

అర్హత ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 6, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 27, 2026.
  • చివరి తేదీ సమయం: రాత్రి 11:59 గంటల వరకు
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us