AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakarakaya Pakodi: కరకరలాడే కాకరకాయ పకోడీ.. అబ్బబ్బ ఒక్క సారి ఇలా ట్రై చేయండి

 కూరగాయలన్నింటిలోకీ ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, రక్తశుద్ధి చేసే లక్షణాలు మరియు డయాబెటిస్‌ను నియంత్రించే గుణాలు కాకరకాయలో ఉన్నాయి. కానీ అందులోని చేదుదనం వల్ల చాలామంది, ముఖ్యంగా చిన్నపిల్లలు దీనిని తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే కాకరకాయతో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు కాకుండా.. చేదును పూర్తిగా తొలగించి, పైన కరకరలాడుతూ లోపల కమ్మగా ఉండేలా చిప్స్ లేదా పకోడీ తరహాలో చేసి పెడితే కాకరకాయను అసలు ముట్టుకోని వారు కూడా ఎంతో ఇష్టంగా లాగించేస్తారు! 

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 4:58 PM

Share
కావలసిన పదార్థాలు: పావు కేజీ కాకరకాయలు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 పెద్ద టేబుల్ స్పూన్ బియ్యప్పిండి దీని వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్- ఇది ఆప్షనల్, ఉప్పు, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, పావు టీస్పూన్ ధనియాల పొడి , పావు టీస్పూన్ జీలకర్ర పొడి , పావు టీస్పూన్ గరం మసాలా పొడి, పావు టీస్పూన్ చాట్ మసాలా, చిటికెడు వంట సోడా ఇది కూడా ఆప్షనల్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

1 / 5
తయారీ విధానం: పావు కేజీ కాకరకాయలపై ఉండే గరుకు భాగాన్ని చాకుతో కాస్త గీకి తొలగించి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత కాకరకాయలను క్రాస్‌గా మీడియం సైజు బిళ్లల్లా కట్ చేసుకోవాలి. మధ్యలో ముదురు గింజలు ఉంటే తీసేయాలి లేత గింజలైతే ఉంచేయవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి, అందులో పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచితే ముక్కలు మెత్తబడి చేదు నీటిలోకి దిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత ముక్కలను నీటిలో నుంచి తీసి చేత్తో గట్టిగా పిండి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి.

2 / 5
ఒక మిక్సింగ్ బౌల్‌లో 3 నుండి 4 స్పూన్ల శనగపిండి, 1 పెద్ద స్పూన్ బియ్యప్పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా మరీ చిక్కగా కాకుండా, అలాగని పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. చివర్లో చిటికెడు వంట సోడా కూడా వేసి కలపాలి.

3 / 5
ఈ పిండి మిశ్రమంలో పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి చేతితో గట్టిగా అదిముతూ ప్రతి ముక్కకూ పిండి మసాలా సమంగా పట్టేలా కలపాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా నూనెలో వేయాలి అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి.

4 / 5
మీడియం మంటపై అటూ ఇటూ తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారే వరకు వేయించి జాలి గరిటెతో తీసుకోవాలి. అంతే, నోరూరించే క్రిస్పీ కాకరకాయ చిప్స్ సిద్ధం! తింటుంటే ఇది కాకరకాయతో చేసినదేనా అనేంత ఆశ్చర్యపరిచే రుచితో, చేదు ఏమాత్రం తెలియకుండా పిల్లలు సైతం లొట్టలేసుకుంటూ తింటారు

5 / 5
Follow Us