AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : పాండ్యా బ్రదర్స్ మళ్లీ కలిసిపోయారా? ఎయిర్‌పోర్ట్‌లో ఆ నవ్వులు నిజమేనా ?

Video : హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా కలిసి నవ్వుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది తాజా వీడియో కాదని తేలింది. అన్నదమ్ముల మధ్య విభేదాలు ముగిశాయన్న ప్రచారం పై అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం.

Video : పాండ్యా బ్రదర్స్ మళ్లీ కలిసిపోయారా? ఎయిర్‌పోర్ట్‌లో ఆ నవ్వులు నిజమేనా ?
Hardik Pandya
Rakesh
|

Updated on: Aug 02, 2026 | 7:30 AM

Share

Video : భారత క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అన్నదమ్ముల జోడీలలో హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ముందుంటారు. మైదానంలోనైనా, బయటనైనా వీరు ఎప్పుడు కలిసి కనిపించినా అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంటుంది. అయితే గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అసలు మాట్లాడుకోవడం లేదంటూ రకరకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అన్నదమ్ములిద్దరూ తమ విభేదాలను మరచి మళ్లీ కలిసిపోయారని ఫ్యాన్స్ భావించారు.

వైరల్ వీడియో వెనుకున్న అసలు నిజం ఇదే

అయితే ఈ వైరల్ వీడియో వెనుకున్న అసలు నిజం వేరే ఉంది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ క్లిప్ ఇటీవల తీసింది కాదని, అది చాలా పాత వీడియో అని తేలింది. ఎవరో అభిమాని పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా ఇటీవల జరిగిందేమోనని నెటిజన్లు భ్రమపడ్డారు. కాబట్టి హార్దిక్, కృణాల్ మళ్లీ కలిసిపోయారని చెప్పడానికి ఈ వీడియో ఎలాంటి ఆధారం కాదు. వీరిద్దరి ప్రస్తుత సంబంధాల గురించి స్పష్టమైన సమాచారం ఏదీ అందుబాటులో లేదు.

అసలు హార్దిక్ – కృణాల్ మధ్య ఏం జరిగింది?

కొద్ది నెలల క్రితం భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన సమయంలో కృణాల్ పాండ్యా తన సోదరుడైన హార్దిక్‌కు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపించడం మొదలైంది. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిచ్ విడాకుల విషయంలో కుటుంబంలో వచ్చిన విభేదాలే దీనికి కారణమని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని నివేదికల ప్రకారం.. హార్దిక్ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడం వల్లే అందరికీ కొద్దిగా దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.

రూమర్లపై కృణాల్ పాండ్యా ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో కృణాల్ పాండ్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక వీడియోలో ఈ గొడవలపై పరోక్షంగా స్పందించాడు. “నేను నా సోదరుడితో మ్యాచ్ ఆడబోతున్నాను, అంతమాత్రాన మా మధ్య ఉన్నది ఏదీ మారదు. మేమిద్దరం మైదానంలో పోటీదారులమే, కానీ చివరికి అన్నదమ్ములమే. కాబట్టి మ్యాచ్‌లో గెలవడానికి మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం” అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా, తమ మధ్య ఉన్న సంబంధాల గురించి హార్దిక్ కానీ, కృణాల్ కానీ ఇప్పటివరకు నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us