పోలవరం జిల్లా, గూడూరు గ్రామం పిల్లల ఆరోగ్యం కోసం ఐస్క్రీం అమ్మకాలపై నిషేధం విధించింది. స్థానికంగా లభించే కల్తీ ఐస్క్రీం వల్ల దంత, జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించి, గ్రామంలోకి ఐస్క్రీం బళ్లకు అనుమతి లేదని ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. ప్రజారోగ్యం కోసం గతంలో బెల్ట్ షాపులను కూడా నిషేధించిన ఈ గ్రామం, ఆదర్శంగా నిలుస్తోంది.