AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్.. బంగ్లా దెబ్బకు మారిన లెక్కలు..?

ODI World Cup 2027: టీ20 వరల్డ్ కప్ 2026 ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌పై పడింది. అయితే, తాజాగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సాధించిన సిరీస్ విజయం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను తలకిందులు చేసింది. దీనివల్ల మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ అర్హత ప్రమాదంలో పడింది. కరీబియన్ జట్టుకు ఎదురైన ఈ గండం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్.. బంగ్లా దెబ్బకు మారిన లెక్కలు..?
Odi World Cup 2027
Venkata Chari
|

Updated on: Mar 20, 2026 | 3:00 PM

Share

West Indies ODI World Cup 2027: ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే వన్డే క్రికెట్ సందడి మొదలైంది. బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా పులులు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో 11 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్నాయి. ఈ గెలుపు బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, 2027 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రేసులో ఆ జట్టును ముందు వరుసలో నిలబెట్టింది.

వెస్టిండీస్‌కు పొంచి ఉన్న ముప్పు..

బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, బంగ్లాదేశ్ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకగా, వెస్టిండీస్ జట్టు 9 నుంచి 10వ స్థానానికి పడిపోయింది. 2027 వన్డే ప్రపంచకనప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆతిథ్య దేశాలుగా ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ఎనిమిది జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగానే ప్రవేశిస్తాయి.

క్వాలిఫికేషన్ సమీకరణాలు..

వెస్టిండీస్ జట్టు 2027 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే టాప్-10లో కొనసాగడం తప్పనిసరి. కానీ, ప్రస్తుతం బంగ్లాదేశ్ జోరు చూస్తుంటే కరేబియన్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. రాబోయే వన్డే మ్యాచుల్లో వెస్టిండీస్ ఓడిపోతే, ఆ జట్టు క్వాలిఫికేషన్ రేసు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే గత వన్డే వరల్డ్ కప్‌నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, మరోసారి అటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

టీమిండియా పక్కా ప్లాన్..

మరోవైపు, గత వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ చేజార్చుకోకూడదని పట్టుదలగా ఉంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. మొత్తానికి 2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ పోరు రసవత్తరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us