AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OK అంటే అర్థం ఏంటో తెలుసా..? 200 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పదం గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

కేవలం రెండు అక్షరాలే.. కానీ వంద మాటల అంగీకారాన్ని తెలుపుతుంది. అదే OK పదం. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే పదాలలో మొదటి వరుసలో ఉండే OK.. అసలు ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అమెరికా ఎన్నికల రాజకీయం ఏంటి? ఇది గ్లోబల్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? 200 ఏళ్ల చారిత్రక నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

OK అంటే అర్థం ఏంటో తెలుసా..? 200 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పదం గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..
What Is The Actual Full Form Of Ok
Krishna S
|

Updated on: Jun 12, 2026 | 12:04 PM

Share

మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ చాటింగ్‌లలో, ఆఫీస్ మెయిల్స్‌లో, ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు రోజుకు కనీసం పదిసారైనా వాడే పదం OK. భాష, ప్రాంతం, సంస్కృతితో సంబంధం లేకుండా ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే పదాలలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. కేవలం రెండు అక్షరాలతోనే వంద మాటల అంగీకారాన్ని తెలిపే ఈ చిన్న పదం వెనుక 200 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? ఒక సరదా జోక్‌గా మొదలైన ఈ పదం గూగుల్, సోషల్ మీడియా కాలంలో గ్లోబల్ వర్డ్‌గా ఎలా మారిందో చాలా మందికి తెలియదు.

OK అంటే ఓల్ కరెక్ట్..

చాలామంది OK అనేది ఒక మోడ్రన్ పదం అనుకుంటారు. కానీ దీని చరిత్ర 1830వ దశకంలో అమెరికాలో మొదలైంది. ఆ సమయంలో అక్కడి వార్తాపత్రికల రచయితలు, ఎడిటర్లు కొన్ని పదాల స్పెల్లింగులను మార్చి సరదాగా రాయడం ఒక ట్రెండ్‌గా ఉండేది. అలా All Correct అనే పదబంధాన్ని హాస్యభరితంగా Oll Korrect అని రాసేవారు. ఈ Oll Korrect కు సంక్షిప్త రూపమే ఈ OK. 1839లో బోస్టన్ మార్నింగ్ పోస్ట్ పత్రిక సంపాదకుడు చార్లెస్ గోర్డాన్ గ్రీన్ ఒక సమీక్షలో మొదటిసారిగా ఈ పదాన్ని ముద్రణలో ఉపయోగించినట్లు చరిత్రకారుడు అలాన్ మెట్‌కాల్ఫ్ తన పుస్తకంలో తెలిపారు.

అమెరికా ఎన్నికల రాజకీయం..

కేవలం పత్రికలకే పరిమితమైన ఈ పదం 1840 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. అప్పటి అభ్యర్థి మార్టిన్ వాన్ బ్యూరెన్ కు మద్దతుగా ఆయన సొంత ఊరు పేరైన Old Kinderhook అనే పేరుతో ఆయన మద్దతుదారులు OK Clubs ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ క్యాంపెయిన్ వల్ల OK అనే పదం అమెరికా నలుమూలలా వ్యాపించింది.

టెలిగ్రాఫ్ విప్లవం – గ్లోబల్ ఎంట్రీ

ఆ తర్వాత కాలంలో టెలిగ్రాఫ్ ఆవిర్భావం ఓకే రాతపూర్వక ప్రయాణాన్ని మార్చేసింది. టెలిగ్రాఫ్‌లో సందేశాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పంపడానికి చిన్న పదాల అవసరం ఏర్పడింది. దాంతో సందేశం అందింది, అంతా బాగుంది అని అవతలి వ్యక్తికి షార్ట్‌గా చెప్పడానికి OK అత్యంత ఉపయోగకరమైన పదంగా మారి.. ప్రపంచమంతటా విస్తరించింది.

ఇతర భాషల వాదనలు.. కానీ నిజం ఇదే..

OK మూలాలపై భాషావేత్తలలో భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. చోక్తావ్ భాషలోని Oke (అలాగే కానివ్వండి) అనే పదం నుండి వచ్చిందని కొందరు, స్కాటిష్ పదం Och Aye నుండి వచ్చిందని మరికొందరు, అంతా బాగుంది అని అర్థం వచ్చే గ్రీకు పదం Ola Kala కు ఇది రూపమని ఇంకొందరు నమ్ముతారు. అయితే వీటికి బలమైన చారిత్రక ఆధారాలు లేవు. అమెరికన్ వార్తాపత్రికల ద్వారానే ఇది పుట్టిందనేది మెజారిటీ చరిత్రకారుల ఏకీభవించే సత్యం.

హాలీవుడ్ నుండి వాట్సాప్ వరకు..

ఆధునిక కాలంలో హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల రాకతో OK అనేది గ్లోబల్ సింబల్‌గా మారిపోయింది. ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బిలియన్ల కొద్దీ ప్రజలు దీనిని వాడుతున్నారు. సందర్భాన్ని బట్టి దీని అర్థం మారుతుంది.

రూపాలు మారినా.. అర్థం ఒక్కటే..

కాలక్రమేణా డిజిటల్ కమ్యూనికేషన్‌లో దీని వాడకం అనేక రూపాలు తీసుకుంది.

OK – Okay: ప్రపంచవ్యాప్తంగా రాతపూర్వక సంభాషణలో ఉపయోగించే అత్యంత ప్రామాణిక రూపం.

O.K.: చుక్కలతో కూడిన ఈ రూపం ఒక పాత శైలి, ప్రస్తుతం దీని వాడకం చాలా అరుదు.

K – KK: నేటి చాటింగ్ జనరేషన్ మరింత వేగంగా అంగీకారాన్ని తెలపడానికి వాడుతున్న మోడ్రన్ షార్ట్‌కట్స్.

ప్రపంచాన్ని ఏకం చేసిన రెండు అక్షరాలు

ఏదైనా ఒక పదం ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ఎలాంటి అనువాదం లేకుండా నేరుగా వాడబడుతోంది అంటే అది ఒక్క OK మాత్రమే. 200 ఏళ్ల క్రితం ఒక చిన్న జోక్‌గా ప్రారంభమై, నేడు మానవ దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైంది. భాషలు, సంస్కృతుల సరిహద్దులను చెరిపేసి, ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఈ రెండు అక్షరాల సరళతే దీని అసలైన బలం.

Follow Us