AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక 30 కాదు 60 రోజులు

కొత్త వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫ్యాన్సీ నంబర్ ఎంపిక కోసం ఇప్పటివరకు ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన తేదీ నుంచి రెండు నెలలలోపు వాహన యజమానులు తమకు నచ్చిన నంబర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Telangana: ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక 30 కాదు 60 రోజులు
Fancy Number
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 12, 2026 | 11:58 AM

Share

కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకమైన లేదా తమకు నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ (ఫ్యాన్సీ నంబర్) తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకునేందుకు ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది. దీంతో వాహన యజమానులకు తమకు నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునేందుకు మరింత సమయం లభించనుంది.

సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ఇస్తారు. గతంలో ఈ టీఆర్ గడువు 30 రోజులు మాత్రమే ఉండేది. ఆ సమయంలోనే ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసి, నంబర్‌ను ఖరారు చేయాల్సి వచ్చేది. అయితే చాలామంది వాహన యజమానులు తమకు కావాల్సిన నంబర్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవడం, వేలం ప్రక్రియలో పాల్గొనడం లేదా ఇతర కారణాల వల్ల గడువులోపు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ గడువును రెండు నెలలకు పెంచింది.

వాహనం కొనుగోలు చేసే సమయంలో ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎంపిక చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ నంబర్‌ను ఖరారు చేయని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కొత్త నిబంధనల ప్రకారం, తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన తేదీ నుంచి రెండు నెలల లోపు ఫ్యాన్సీ నంబర్‌ను బుక్ చేసుకోకపోతే, ఆ వాహనానికి శాఖ తరఫున సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. అంటే వాహన యజమాని ఎలాంటి ప్రత్యేక నంబర్‌ను ఎంపిక చేయకపోతే, అందుబాటులో ఉన్న సాధారణ సీరియల్ నంబర్‌ను వాహనానికి కేటాయిస్తారు.

ఒకసారి సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన తర్వాత తిరిగి ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ప్రత్యేక నంబర్ కావాలనుకునే వాహన యజమానులు నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?