AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు!

తెలంగాణలో గిరిజన రైతుల జీవనాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ప్రధాన ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఇందులో భాగంగానే ఇందిర సౌర గిరి జల వికాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Telangana: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు!
Indira Soura Giri Jala Vikasam
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 3:11 PM

Share

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన రైతుల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఇందిర సౌర గిరి జల వికాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లోని గిరిజన రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే లక్ష్యంగా పథకం ముఖ్య ఉద్దేశమన ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా సుమారు 2.10 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఈ క్రమంలో 100 శాతం సబ్సిడీతో సౌర పంపు సెట్లను రైతులకు అందజేయనుంది. విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సౌరశక్తి ద్వారా సాగునీటిని అందించి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించి మంచి ఫలితాలు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి రూ.22,600 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించింది. రైతు భరోసా పథకానికి రూ.18,000 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ కోసం రూ.3,500 కోట్లు కేటాయించడం జరిగింది.

ఈ చర్యల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని పోడు రైతులతో పాటు అన్ని వర్గాల రైతులకు మేలు చేకూరనుంది. గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీరు, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణానికి అనుకూలమైన సౌరశక్తిని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మూడు గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి, పదోన్నతులు..!
మూడు గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి, పదోన్నతులు..!
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీపై కీలక ప్రకటన
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీపై కీలక ప్రకటన
లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంట్లో పూజ గదిలో ఏ శంఖాన్ని ఉంచాలి?
లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంట్లో పూజ గదిలో ఏ శంఖాన్ని ఉంచాలి?
మనసు ఎలా ఒప్పింది అమ్మా..? భర్తకు ఆరోగ్యం బాలేదని మరీ ఇలానా..?
మనసు ఎలా ఒప్పింది అమ్మా..? భర్తకు ఆరోగ్యం బాలేదని మరీ ఇలానా..?
APPSC గ్రూప్ 1, 2 సహా 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయ్
APPSC గ్రూప్ 1, 2 సహా 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయ్
అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ పట్టేసిన కెప్టెన్స్
అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ పట్టేసిన కెప్టెన్స్
పార్లర్‌ తో పనిలేదు.. ఈ పండ్లతో మీ ముఖంలో గోల్డెన్ గ్లో ఖాయం!
పార్లర్‌ తో పనిలేదు.. ఈ పండ్లతో మీ ముఖంలో గోల్డెన్ గ్లో ఖాయం!
వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..
వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!
మటన్ కర్రీలో ఈ ఒక్కటీ వేసి వండితే వీధి మొత్తం ఘుమఘుమలే..
మటన్ కర్రీలో ఈ ఒక్కటీ వేసి వండితే వీధి మొత్తం ఘుమఘుమలే..