AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంజీరా నదిలో గోస వెళ్లబోస్తున్న చేపలు.. వేల సంఖ్యలో మృత్యువాత..!

సంగారెడ్డి జిల్లాలో మంజీరమ్మ కన్నీరు పెడుతోంది .ఒకప్పుడు జీవకళతో ఉట్టిపడిన నది, ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యంగా మారింది. ముఖ్యంగా నక్కవాగు ద్వారా వస్తున్న రసాయన జలాలు మంజీర నదిని మృత్యుకూపంగా మారుస్తున్నాయి. హత్నూర మండలం పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచర్ల పరిసరాల్లో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది.

Telangana: మంజీరా నదిలో గోస వెళ్లబోస్తున్న చేపలు.. వేల సంఖ్యలో మృత్యువాత..!
Fish Die In Manjeera River
P Shivteja
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 3:42 PM

Share

సంగారెడ్డి జిల్లాలో మంజీరమ్మ కన్నీరు పెడుతోంది .ఒకప్పుడు జీవకళతో ఉట్టిపడిన నది, ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యంగా మారింది. ముఖ్యంగా నక్కవాగు ద్వారా వస్తున్న రసాయన జలాలు మంజీర నదిని మృత్యుకూపంగా మారుస్తున్నాయి. హత్నూర మండలం పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచర్ల పరిసరాల్లో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో చేపల మృతితో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

సంగారెడ్డి జిల్లా మత్స్యకారుల బతుకు చిత్రం ఛిన్నాభిన్నమవుతోంది. నక్కవాగు రూపంలో వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు మంజీర నదిని కలుషితం చేస్తున్నాయి. పారిశ్రామిక వాడల నుండి వెలువడే రసాయన జలాలను నేరుగా వాగులోకి వదలడంతో, ఆ విషతుల్యమైన నీరు మంజీరలో కలిసి మత్స్య సంపదను హరించివేస్తోంది. నేడు చేపల వేటకు వెళ్లిన పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచర్ల గ్రామస్థులకు నదిలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న మృత చేపలు దర్శనమిచ్చాయి.

.గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. చేపలు చనిపోయిన ప్రతిసారీ అధికారులు వస్తారు, నమూనాలు సేకరిస్తారు. కానీ యాక్షన్ మాత్రం శూన్యమని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కవాగు పరిసర గ్రామాల ప్రజలు ఈ నీటిని తాగలేక, వాడలేక నానా అవస్థలు పడుతున్నారు. కంపెనీల యాజమాన్యాలు లాభాల కోసం చూస్తూ, వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నదిలోకి వదులుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఈ కాలుష్య కోరల నుండి మంజీరను కాపాడేవారే లేరా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. లిస్ట్‌లో తోపు ప్లేయర్లు
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్