Sai Pallavi: అఫీషియల్.. సాయి పల్లవితో కొత్త సినిమాను ప్రకటించిన మణిరత్నం.. హీరో ఎవరో తెలుసా?
ఉగాది పండగను పురస్కరించుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. 'మద్రాస్ టాకీస్' బ్యానర్ నిర్మిస్తున్న ఈ 23వ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో ఓ సందర్భంలో సాయి పల్లవిని ప్రశంసించిన ఆయన అవకాశం వస్తే తాను తప్పకుండా ఆమెతో సినిమా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు మణిరత్నం. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ‘మద్రాస్ టాకీస్’ బ్యానర్ నిర్మిస్తున్న ఈ 23వ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మణి రత్నం చివరిగా ‘థగ్ లైఫ్’ అనే సినిమా తీశారు. కమల్ హాసన్, శింబులతో తీసిన ఈ మల్టీ స్టారర్ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. దీనికి తోడు కమల్ కామెంట్స్ తో చాలా చోట్ల ఈ మూవీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే అంతకు ముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియెన్ సెల్వన్’, ‘పొన్నియెన్ సెల్వన్ 2’ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
కాగా థగ్ లైఫ్ తో నిరాశపర్చిన మణిరత్నం ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తారని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. న్నారు. ఈ చిత్రాన్ని ‘మద్రాస్ టాకీస్’ నిర్మిస్తోంది. ఇది ఆ సంస్థకు 23వ చిత్రం. ప్రస్తుతం ‘రామాయణం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలో ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుందని సమాచారం. మరోవైపు ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి కూడా సిద్ధమవుతున్నారు. గతంలో విజయ్, మణి రత్నం ‘చెక్క చివంత వానం’ (తెలుగులో నవాబ్ ) చిత్రంలో కలిసి పనిచేశారు.
విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం సినిమా
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమా ప్రకటన
హీరో హీరోయిన్లుగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి
అధికారిక ప్రకటన చేసిన నిర్మాణ సంస్థ #VijaySethupathi #SaiPallavi #ManiRatnam pic.twitter.com/01YBLVevEy
— Telugu Stride (@TeluguStride) March 20, 2026
#VijaySethupathi X #SaiPallavi
A very unconventional pairing for a #RomanticDrama even though there is only 15 yrs gap, the age gap looks so much more between them unless ofcourse cinema magic to make Sai Pallavi look older or Vijay Sethupathi look younger.
I have never been… pic.twitter.com/GfO661jvDu
— PopcornPassions (@popcornpassions) March 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




