AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!

Venus Transit 2026: ఈ నెల(మార్చి) 26 నుంచి ఏప్రిల్ 19 వరకు శుక్రుడు మేష రాశిలో సంచారం చేస్తాడు. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులవారిలో అధికార దాహం బాగా పెరుగుతుంది. అధికారం కోసం, ఉన్నత పదవులు కోసం ఉద్యోగాలు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి విషయంలో కూడా శుక్రుడు యాంబిషన్ పెంచుతాడు. పట్టుదల, మొండితనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. ధన దాహం, అధికార వ్యామోహంతో పాటు, స్త్రీ లోలత్వం కూడా బాగా పెరుగుతుంది. సిరిసంపదలు, భోగభాగ్యాలు బాగా వృద్ధి చెందుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 3:37 PM

Share
మేషం: ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం మీద దృష్టి పూర్తిగా కేంద్రీకృతమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. శృంగార జీవితం మరింతగా విజృంభిస్తుంది. అధికార యోగానికి అవకాశమున్న ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. విలాస జీవితం అలవాటవుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం, ఉద్యోగంలో అధికారం చేపట్టడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెంచుకోవడం వంటి విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. స్త్రీ సాంగత్యం పెరుగుతుంది. విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను గట్టి పట్టుదలతో లాభాల బాట పట్టించడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగం కలుగుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టుదలగా మనసులోని కోరికల్ని సాధించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్ని ఆత్మ విశ్వాసంతో లాభసాటిగా ముందుకు నడిపిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. గృహ, వాహన యోగాల మీద శ్రద్ధ పెడతారు. సిరి సంపదలు, భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకుంటారు.

3 / 6
సింహం: ఈ రాశికి శుక్రుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల ధన దాహం బాగా పెరుగుతుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం ఏర్పడుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. విలాస జీవితం అలవడుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు అవకాశం ఉంది.

4 / 6
తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి శుక్ర గ్రహ సంచారం వల్ల ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. సర్వశక్తులూ వినియోగించి ఆదాయాన్ని పెంచుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. లాభదాయక పరిచయాలు విస్తరిస్తాయి. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. భోగ భాగ్యాలు అనుభవిస్తారు.

5 / 6
మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి ఆస్తి లాభంతోపాటు, గృహ, వాహన యోగాలు కూడా పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారయోగం పడుతుంది. లాభదాయక వ్యవహారాలను, లావాదేవీలను ఎక్కువగా చేపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి.

6 / 6
Follow Us