AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విహారయాత్రలో తీవ్ర విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.

విహారయాత్రలో తీవ్ర విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు..!
Bhadrachalam Tragedy
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 4:37 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ఏపీ లోని ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. వీరిలో ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు, భద్రాచలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారి కోసం పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగారు. వీరిలో ఐదుగురు గల్లంతు అయ్యారు. ఒకరిని కాపాడబోయి.. మరొకరు ఇలా నీటిలో మునిగిపోయారు.

ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోక తేజ, నవదీప్ ఉయ్యూరు ప్రాంతానికి చెందినవారు. పాశం సతీష్ కుమార్ మదనపల్లి, చారు గుండ్ల శ్రీకర్, పొడిచేటి అభిరామ్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇవాళ్లంతా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఇప్పటి వరకూ శ్రీకర్, నవదీప్ ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us