AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. ఓపెన్ చేసి చూడగా..

ఏసీ కూలింగ్ తగ్గిందంటే సర్వీసింగ్ సమస్య అనుకోవద్దు… చిన్న పొరపాటు కూడా గ్యాస్ లీక్‌కు కారణమవుతుంది. టెక్నీషియన్ చేసిన ఒక తప్పిదం ఎలా పెద్ద సమస్యగా మారిందో తెలుసుకోండి… ఏసీ విషయంలో చిన్న చిన్న పొరపాట్లను నివారిస్తే.. వాటి మన్నికను కాపాడుకోవచ్చు.

ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. ఓపెన్ చేసి చూడగా..
AC gas leak
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2026 | 3:17 PM

Share

ఒక కస్టమర్ తమ ఏసీ సరిగా కూలింగ్ ఇవ్వడం లేదని సర్వీసింగ్ కోసం సంప్రదించారు. టెక్నీషియన్ ఏసీని పరిశీలించగా, ఇది సాధారణ సర్వీసింగ్ సమస్య కాదని, గ్యాస్ లీకేజీ ఉన్నట్లు గుర్తించారు. మరింత క్షుణ్ణంగా పరిశీలించగా, ఇండోర్ యూనిట్ వద్ద గ్యాస్ లీక్ స్పష్టంగా కనిపించింది. ఈ లీకేజీకి కారణం ఏమిటని కస్టమర్ అడగగా, ముందుగా ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసిన టెక్నీషియన్ ఫ్లేర్ నట్లను బిగించేటప్పుడు టెఫ్లాన్ టేప్ ఉపయోగించినట్లు వెల్లడైంది. అయితే నిపుణుల ప్రకారం, ఫ్లేర్ కనెక్షన్‌లలో టెఫ్లాన్ టేప్ వాడటం సరైన పద్ధతి కాదు. ఇది సమయం గడిచేకొద్దీ తన గుణాన్ని కోల్పోయి, గ్యాస్ లీకేజీకి దారితీసే అవకాశం ఉంటుంది. టెక్నీషియన్ షాంపూ నీటితో పరీక్ష చేసి, లీకేజీని ప్రత్యక్షంగా కస్టమర్‌కు చూపించారు. బుడగలు రావడం ద్వారా గ్యాస్ లీక్ స్పష్టంగా నిరూపితమైంది.

నిపుణులు సూచించిన ప్రకారం, ఏసీ అమర్చేటప్పుడు ఫ్లేర్ నట్లను సరైన పద్ధతిలో, తగిన టూల్స్‌తో గట్టిగా బిగించాలి. టెఫ్లాన్ టేప్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏసీలో గ్యాస్ లీకేజీ సమస్యలు చాలా కాలం వరకు రావు. కాబట్టి, కస్టమర్లు ఏసీ ఇన్‌స్టాలేషన్ సమయంలో సరైన పద్ధతులు పాటిస్తున్నారో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఎండాకాలంలో ముఖ్యంగా మీరు ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏసీలు ఎక్కువకాలం బాగా పనిచేస్తాయి..

Also Read: గీజర్ నుంచి నీళ్లు సరిగా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. ఓపెన్ చేసి చూడగా.. 

Follow Us