- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Mayank Yadav Likely To Get Rs 14 Crores From Lucknow Super Giants Ahead Of Mega Auction
IPL 2025: అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 14 కోట్లు.. నక్క తోక తొక్కిన గంభీర్ శిష్యుడు.. ఎవరంటే
బూమ్.. బూమ్.. బుమ్రా 2.0, టీమిండియాకి భవిష్యత్తు ఆటగాడైన మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో నక్క తోక తొక్కాడు. గతేడాది రూ. 20 లక్షలు పలికిన ఈ ప్లేయర్.. ఇప్పుడు మెగా వేలానికి ముందుగా రూ. 14 కోట్లు అందుకోనున్నాడు. ఆ వివరాలు ఇలా..
Updated on: Oct 23, 2024 | 8:01 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఎవ్వరూ ఊహించనంతగా రూ. 14 కోట్లు ఇవ్వనుంది.

అవునండీ.! లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ ఈ రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌ను రెండవ ఎంపికగా రిటైన్ చేసుకోనుందట. మెగా వేలం రూల్స్ ప్రకారం.. మయాంక్ యాదవ్ రూ. 14 కోట్లు వేతనం అందుకోనున్నాడు.

ముందుగా అన్‌క్యాప్డ్ జాబితాలో అట్టిపెట్టుకోవాలని ఫ్రాంచైజీ భావించింది. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా మయాంక్ యాదవ్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. తద్వారా అతని కనీస ధర మొత్తం రూ.11 కోట్లకు చేరింది.

మయాంక్ యాదవ్ గత సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దాదాపు 150 కిమీ బౌలింగ్ చేసిన మయాంక్ 73 బంతుల్లో 85 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పుడు యువ పేసర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.

మయాంక్ యాదవ్‌తో పాటు, లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ నికోలస్ పూరన్, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను అట్టిపెట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సో ఈ మెగా వేలంలో పూరన్ కనిపించడనే చెప్పాలి.




