AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simbu : శింబుకు జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందిగా..

నటుడు శింబు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు ప్రస్తుతం అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో STR 49 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ టాక్ హల్‌చల్ చేస్తోంది.

Simbu : శింబుకు జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందిగా..
Simbu
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2024 | 8:52 PM

Share

స్టార్ హీరో శింబు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో వరుస సినిమాలతో అలరించిన ప్రస్తుతం స్పీడ్ తగ్గించారు. ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. శింబు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆతర్వాత హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మన్మధ, వల్లభ సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి అభిమానుల్లో బాగా పాపులర్ అయ్యాడు శింబు. ఆయన నటుడిగానే కాకుండా ప్రముఖ నేపథ్య గాయకుడు కూడా. శింబు పాడిన “లుసు పన్నెనే” పాట ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

ఇక శింబు ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో శింబు కనిపించనున్నాడు. దీని తరువాత, శింబు చాలా చిత్రాలకు కమిట్ అయ్యాడు. అలాగే అతని ప్రస్తుత చిత్రం STR 49. అలాగే ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వత్ మరిముత్తు ఈ సినిమాతో పాటు రంగనాథన్ నటిస్తున్న డ్రాగన్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ప్రస్తుతం ఆసక్తికర వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. మీనాక్షి రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు శింబు సినిమాలోనూ అవకాశం అందుకుందని టాక్. మీనాక్షి ఇప్పటివరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, వరుణ్ తేజ్ మట్కా సినిమాల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..