Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ తేజ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది, మొన్నామధ్య మోక్షజ్ఞ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..
Mokshagna
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2024 | 4:52 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే భారీ సినిమాలను కూడా లైనప్ చేశారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఇప్పుడు బాబీతో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అలాగే బోయపాటితో అఖండ 2ను కూడా లైనప్ చేశారు. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ అదిరిపోయే స్టోరీని రెడీ చేశాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సింబ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీ అందమైన లవ్ స్టోరీతో ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని కొందరు అంటున్నారు. మరికొందరేమో యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైన మోక్షజ్ఞ  సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నామధ్య మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని. రవీనా టాండన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. తెలుగులోనూ రవీనా నటించారు. ఇక రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 2లో కీలక పాత్రలో నటించి మెప్పించింది రవీనా. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కోసం రవీనా కూతురు రాషా థడానిని రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే ఈ చిన్నది ఆడిషన్ కూడా ఇచ్చిందని.. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.