Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటవారసులు ఉన్నారు. వారిలో స్టార్ విలన్ అమ్రీష్ పురి మనవడు కూడా ఒకరు. అమ్రీష్ పురి మనవడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అతను ఎవరో తెలుసా.?

Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?
Amrish Puri
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 25, 2024 | 6:20 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటవారసులు ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తమ ప్రతిభతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక హీరోల కొడుకులు, దర్శకుల కొడుకులు కుమార్తెలు మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్స్ గా మెప్పించిన వారి వారసులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో అమ్రీష్ పురి మనవడు కూడా ఒకరు. అమ్రీష్ పురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు అమ్రీష్ పురి.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

ఇప్పటికీ విలన్ అంటే ఆయనే గుర్తొస్తారు. భారీ ఆకారం, గంభీరమైన గొంతుతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు ఒణుకు పుట్టిస్తాయి. ఆ ఆయన ఎన్నో పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో మాంత్రికుడిగా అదరగొట్టారు అమ్రీష్ పురి. ఆయన నటన సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో అమ్రీష్ పురి మానవుడు హీరోగా రాణిస్తున్నడన్న విషయం చాలా మందికి తెలియక పోవొచ్చు. అతను ఎవరో కాదు.

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

అతని పేరు వర్ధన్ పూరి. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు వర్ధన్ పూరి . 2019లో వచ్చిన యే సాలి ఆషికి అనే సినిమాతో వర్ధన్ పూరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బ్లాడీ ఇష్క్యూ, దష్మీ, ఆస్క్ వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు వర్ధన్ పూరి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే అశ్వినీదత్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వర్ధన్ పూరి కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వర్ధన్ పూరి టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. అయితే వర్ధన్ పూరి హీరోగా పరిచయం అవుతాడా..? లేదా విలన్ గా నటిస్తాడా అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

在 Instagram 查看这篇帖子

Vardhaan Puri (@vardhanpuri02) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు