Allu Arjun: ఐకాన్ స్టార్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న న్యాయస్థానం

అల్లు అర్జున్ కు హైకోర్టు లో ఊరట లభించింది. ఈ కేసుపై నవంబర్ 8 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మీద నంద్యాల పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే

Allu Arjun: ఐకాన్ స్టార్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న న్యాయస్థానం
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 25, 2024 | 5:08 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యాలనీ సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మాజీఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు లో  వాదనలు ముగిసాయి. ఇరు వైపులా వాదనలు ముగియడంతో నవంబర్ 8 న నిర్ణయం వెల్లడిస్తామని హై కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎఫ్ ఐ ఆర్ అధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నవంబర్ 8 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అలాగే ఈ కేసుపై నవంబర్ 8న తదుపరి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

కాగా ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సయమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కార్యకర్తలు అనుచరులు భారీగా అక్కడకు చేరుకున్నారు. శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్ తో అల్లు అర్జున్ వచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆ సమయంలో అల్లు అర్జున్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మీద నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మొదటి భాగం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.