అమ్మబాబోయ్..! ఏముంది మావ.. ఈ హీరోయిన్ కూతురు రచ్చ లేపుతోందిగా..

సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యారు నటి వనితవిజయ్ కుమార్. ఈ అమ్మడు తెలుగులో నటించిన సినిమాలు కేవలం రెండు మాత్రమే.. కానీ చాలా పాపులర్. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచింది ఆమె..

అమ్మబాబోయ్..! ఏముంది మావ.. ఈ హీరోయిన్ కూతురు రచ్చ లేపుతోందిగా..
Vanitha Vijayakumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 25, 2024 | 5:46 PM

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటీమణుల్లో వనిత విజయ్ కుమార్ ఒకరు. సినిమాతో చాలా మంది పాపులర్ అవుతుంటే ఈ అమ్మడు మాత్రం వ్యక్తిగత విషయాలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వనిత విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు విజయ్ కుమార్.  ఇక వనిత విషయానికొస్తే తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో దేవి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఆ వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తెలుగులో దేవి సినిమా తర్వాత తిరిగి చివరిగా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది వనితా. కాగా ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికొస్తే.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది అతనితో కూడా విడిపోయింది. అయితే ఇప్పుడు వనిత విజయ్ కుమార్ కూతురు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను చూసి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని పై వనిత విజయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమార్తె జోవిక ను సినిమాల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నా.. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?