AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Reddy : ఓ మై అక్కో..! సినిమా చూసి నటుడుని పిచ్చి కొట్టుడు కొట్టిన మహిళ.. మూవీ టీమ్ షాక్

థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఓ మహిళ సినిమా యూనిట్ పై దాడి చేసింది. సినిమాలోని విలన్ ను నిజంగా ప్రేమజంటను విడదీశాడని అతని పై కోపంతో తిడుతూ.. పిచ్చి కొట్టుడు కొట్టింది.

Love Reddy : ఓ మై అక్కో..! సినిమా చూసి నటుడుని పిచ్చి కొట్టుడు కొట్టిన మహిళ.. మూవీ టీమ్ షాక్
Love Reddy
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2024 | 3:06 PM

Share

ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ ల రాబడుతున్నాయి. దాంతో చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే లవ్ రెడ్డి. అయితే ఈ సినిమా థియేటర్స్ చూసిన మూవీ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. సినిమా చూసిన తర్వాత ఓ మహిళ చిత్రయూనిట్ లో ఓ వ్యక్తికి ఇరగ కొట్టుడు కొట్టింది. దాంతో మూవీ టీమ్ షాక్ అయ్యింది. ఇంతకూ ఆ మహిళ ఎందుకు దాడి చేసింది. అనేది ఇప్పుడు చూద్దాం.!

ఇది కూడా చదవండి : Tollywood : ఈ దెయ్యం పిల్ల అందానికి కుర్రాళ్ళు బలి.. మంటలు రేపుతున్న మసూద బ్యూటీ

సినిమాల్లో కొన్ని పాత్రలు జనాల మనసుకు హత్తుకుంటూ ఉంటాయి. ఆ పాత్రలు ప్రేక్షకులకు చాలా దగ్గరవుతాయి. అలాగే తాజాగా లవ్ రెడ్డి సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించారు. ప్రేక్షకులతో పాటు మూవీ టీమ్ కూడా థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఓ వ్యక్తి ప్రేమ జంటను విడదీస్తాడు. దాంతో సినిమా చూసిన ఓ మహిళ ప్రేమజంటను విడదీస్తావా.? అంటూ నటుడి పై దాడి చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :వామ్మో..! ఒంటరిగా చూస్తే భయంతో బకెట్ తన్నేస్తారు జాగ్రత్త.. దైర్యం ఉంటేనే చూడండి..

స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించారు. ఈ మూవీని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. లవ్ రెడ్డి సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ను హీరోయిన్ తండ్రి విడదీస్తాడు. ఈ సినిమాలో విలన్ గా రామస్వామి నటించారు. కాగా ఈ సినిమాను హైదరాబాద్‌లోని నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకులతో కలిసి మూవీ టీమ్ వీక్షించింది. కాగా సినిమా అయిపోయిన తర్వాత ఓ మహిళ మూవీ టీమ్ దగ్గరకు వచ్చి.. విలన్ గా నటించిన రామస్వామి పై దాడి చేసింది. దాంతో మూవీ టీమ్ షాక్ అయ్యింది. సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఒక ప్రేక్షకురాలు థియేటర్స్ విజిట్ కు వెళ్లిన చిత్రబృందంలోని తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమజంటను విడిదీశాడని కోపంతో తిడుతూ దాడి చేసింది. ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగా జరిగిందా.? లేక మూవీ టీమ్ కావాలనే ఇది ప్లాన్ చేశారా అని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

ఆమె కోపానికి కారణమైన సీన్ ఇదే..

View this post on Instagram

A post shared by Meme Raja (@meme_raaja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..