బిగ్ బాస్‌లో.. టెర్రర్ పుట్టించిన గంగవ్వ దెబ్బకు కంటెస్టెంట్స్ హడల్
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 న 14 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడు వారాల్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అదే సందర్భంలో ఆరో వారంలో మరో 8 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ సహాయంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.
బిగ్ బాస్ హౌస్‌ను మరింత ఎంటర్‌టైనింగ్ గా మార్చారు. ఇక ఈక్రమంలోనే తాజా ఎపిసోడ్ లో గంగవ్వ.. రెచ్చిపోయారు. టేస్టీ తేజ, ముక్కు అవినాష్ తో కలిసి.. కంటెస్టెంట్స్‌ను బెంబేలెత్తించారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఉలిక్కి పడి లేచారు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు. అక్కడ గంగవ్వను చూసిన కంటెస్టెంట్స్ గజ గజ వణికిపోయారు. గంగవ్వ దగ్గరకు వెళ్లి ఏమైందో తెలసుకుందామని ప్రయత్నించినా ఆమె అరుపులు, కేకలకు భయపడిపోయారు. ఆ తర్వాత అవినాష్, టేస్టీ తేజ కలిసి.. గంగవ్వను ధైర్యంగా.. మెల్లగా గదిలోకి తీసుకెళ్లి ఆమె బెడ్‌పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి గంగవ్వకు దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. అయితే కాసేపటికి.. ఇది పూర్తిగా ఫ్రాంక్ అని తేల్చేశారు ఈ ముగ్గురు. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ తాము ముగ్గురం మాట్లాడుకునే ఇలా ప్రాంక్ చేశామంటూ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన భార్యపై వెకిలి కామెంట్స్ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ
మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్ ప్రశంసలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

