తన బావను హీరోగా నిలబెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నం
డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈయనను ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ మూవీతో మరోసారి భారీ హిట్ కొట్టాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్..
త్వరలోనే కేజీఎఫ్ 3 సినిమాతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మధ్యలోనే తన బావను టాలీవుడ్లో హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కన్నడలో తన మొదటి సినిమా చంద్ర చకోరితోనే భారీ విజయాన్ని అందుకున్నాడు .. హీరో శ్రీమురళి. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ రోరింగ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. కన్నడ చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 2008లో శ్రీ మురళికి ప్రశాంత్ నీల్ అక్క విద్యతో వివాహం జరిగింది. ప్రశాంత్ నీల్ కు మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా శ్రీ మురళినే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఉగ్రంలో శ్రీమురళినే హీరో. ఇక ప్రస్తుతం అతడు బఘీర సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో దీవాళి కానుకగా.. రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తెలుగులో తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు హీరో శ్రీమురళి. ఇందుకు ప్రశాంత్ నీల్ సాయం చేస్తున్నాడు. బఘీర సినిమా స్టోరీ డెవలప్ మెంట్‌లో సాయం చేసిన ఈయన.. ఇప్పుడు తన బావను తెలుగు ప్రేక్షకులు ఆదరించేలా ప్లాన్స్ చేస్తున్నారట. అందుకోసం తెలుగు స్టార్ హీరోల సాయం తీసుకోనున్నాడని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

