మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్ ప్రశంసలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు మంచి పనులు చేపడుతున్నాడీ సూపర్ స్టార్. ఇందులో భాగంగా ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ప్రాణం పోశాడు మహేష్. ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి వారికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు.
తద్వారా పిల్లల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మరో చిన్నారికి ప్రాణం పోశాడీ సూపర్ స్టార్. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్విక గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. పాప గుండెలో హోల్ ఉందని, చికిత్సకు లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మహేష్ ఫ్యాన్స్ ను ఆశ్రయించారు. వారు ఈ విషయాన్ని ఎంబీ ఫౌండేషన్ కు తెలియజేయడంతో ఆ చిన్నారికి ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు కృతజ్ఞతగా కొన్ని రోజుల క్రితం కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అంతకు మించి అనేలా భారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు మహేష్ అభిమానులు. ఈ ప్లెక్సీ లోనూ ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ.. మా పి.గన్నవరానిది సామి. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ ఖలేజా సినిమాలోని డైలాగ్ తో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

